ప‌వ‌న్ కూడా మొద‌లెట్టేస్తున్నాడు

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ్లాప్ ఇచ్చిన షాక్‌లోంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ సినిమాని భుజాల‌పై మోసుకొని త‌న వంతుగా చేయాల్సిందంతా చేశాడు. సినిమా అయిపోయాక మీడియా ముందు ఎప్పుడూ రాని ప‌వ‌న్‌.. ఈసినిమా కోసం ఎడ‌తెర‌పి లేకుండా ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఎంత చేసినా… న‌ష్టాల నుంచి త‌న బ‌య్య‌ర్ల‌ను కాపాడ‌లేక‌పోయాడు. వాళ్ల‌ను ఆదుకోవ‌డానికి ఓ సినిమా చేయాలిప్పుడు. ప‌వ‌న్ ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈనెల 29న ప‌వ‌న్ కొత్త సినిమా మొద‌లుకాబోతోంది. అదే రోజు.. చిరంజీవి క‌త్తి సినిమా రీమేక్‌కీ ముహూర్తం కుదిరిన సంగ‌తి తెలిసిందే. అంటే అన్న‌య్య బాట‌లోనే త‌మ్ముడూ న‌డుస్తున్నాడ‌న్న‌మాట‌.

ఎస్‌.జె. సూర్య చెప్పిన ఓ క‌థ‌కు ప‌వ‌న్ ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌స్తుతం స్ర్కిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈనెల 29 దాటితే మంచి ముహూర్తాలు లేవ‌ట‌. అందుకే… ఆ రోజు సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిద్దామ‌ని చిత్ర‌బృందం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఆ రోజు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపి వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్లిపోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. ఓకేరోజు చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల సినిమాలు మొద‌ల‌వుతున్నాయి మ‌రి. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే ఇక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close