మరో రెండేళ్లు పవర్‌ స్టార్‌గానే!

జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హౌదా సమస్యపై బిజెపి టిడిపిల పట్ల విమర్శనాత్మకంగా మాట్లాడినప్పటికి మరో రెండేళ్ల వరకూ రాజకీయ కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడైనా ఏం జరుగుతుందనేది అప్పటికి జరిగే పరిణామాలను బట్టి నిర్ణయవుతుంది.తిరుపతి కాకినాడ సమావేశాల్లో కాస్త నిశిత విమర్శలూ వ్యాఖ్యలూ చేయడం ఆయన అభిప్రాయ ప్రకటన తప్ప ఆచరణ ప్రణాళిక కాదని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఒక ఛానల్‌ మిత్రుడు పవన్‌ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన సన్నిహిత నిర్మాత సూచన మేరకు తదుపరి సినిమా షూటింగ్ ఎప్పుడు అని అడిగితే త్వరలోనే అని జవాబిచ్చారాయన. నిజానికి కాకినాడ సభలో నేను సినిమాల్లో నటించాలా వద్దా అని ప్రేక్షకులనే అడిగారు.అక్కడ వున్నవారిలో ఆయన యువ అభిమానులే అత్యధికులు గనక అందరూ సానుకూల సమాధానమే ఇచ్చారు.తను ఖర్చులు సిబ్బంది జీతాల వంటి వాటికోసం నటించి సంపాదించకతప్పదన్నట్టు పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికప్పుడు నేరుగానే చెబుతున్నారు. తన దగ్గర డబ్బులు లేవనీ, అప్పులు తీర్చాలనీ కూడా మరే హీరో చెప్పని విధంగా ఆయన చెబుతుంటారు.

కాకినాడ సభలోగాని ఆ తర్వాత గాని ఆయన ఇతర ప్రధాన పార్టీలు కదలకపోతే తాను రంగంలోకి వస్తానన్నట్టు మాట్లాడారు. రాజకీయాల్లో మీరు చేసేదేమిటో మీరుచెప్పాలి గాని ఇతరులు ముందు చేయాలనీ, లేకపోతే నేను వస్తానని అంటే చెల్లుబాటు కాదు. ఎవరి కార్యాచరణ వారిది. ఆ రోజున పవన్‌ సిపిఎంను అభినందించిన కారణంగానే వారు ఆయనను బలపరుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి తర్వాత వారిలో కొందరిని నేను కలిసినప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారని అడిగారు. బి.వి.రాఘవులు బహిరంగంగానే ఆయన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఆర్‌కె కొత్తపలుకులో దీన్ని అన్యాపదేశంగా అపహాస్యం చేశారు గాని అలా అడగడంలో తప్పేమీ లేదు.

కాకినాడ సభ తర్వాత బిజెపి టిడిపి నాయకులు పవన్‌పై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. వెంకయ్య నాయుడు విసుర్లు విసిరారు. గతంలో నేను కూడా చూడప్పా సిద్దప్పా డైలాగును అనుకరిస్తూ సినిమాలో రాజకీయాలో తేల్చుకోవాలని అన్నప్పుడు చాలా మంది మెచ్చుకోవడం నొచ్చుకోవడం జరిగింది. అది పవన్‌ ప్రశ్నిస్తానంటూనే చంద్రబాబును ప్రశంసిస్తున్న దశ. గత రెండు సభల్లోనూ ఆయన నిజంగానే ప్రశ్నించారు. అయితే ఆయన వ్యక్తిగత నేపథ్యం, బయిట రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి దూకేస్తారనుకోలేదు. అయితే ఇటీవల మరింత స్పష్టంగా తాను రెండేళ్ల పాటుసినిమాలు చూసుకుని ఆ తర్వాతే రాజకీయ కదలికలు మొదలు పెడతానన్నట్టు ఆయన సహాయకులతో సంప్రదింపులు జరిపినవారు చెప్పారు.కాబట్టి ప్రస్తుతానికి విశ్రాంతి అనుకోవలసిందే. ఏదైనా విపరీతం జరిగితే తప్ప! ఇది ఆయన విమర్శకులకు, ప్రేక్షకాభిమానులకు సంతోషం. రాజకీయ అభిమానులకు నిరుత్సాహం కలిగించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close