గురు శిష్యుల‌తో … నాని

నాని జోరుమీదున్నాడు. వ‌రుస‌గా త‌న సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఈ యేడాది నాని నుంచి మూడు సినిమాలొచ్చాయి. నేను లోక‌ల్ ని డిసెంబ‌రులో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఈలోగా కొత్త క‌థ‌ల‌పై సంత‌కాలు కూడా చేసేస్తున్నాడు. తాజాగా డి.వి.వి. దానయ్య బ్యాన‌ర్‌లో నాని ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి శివ అనే ఓ కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర స‌హాయ‌కుడిగా వ‌ర్క్ చేశాడు శివ‌. సోలో, సారొచ్చారు చిత్రాల్లో శివ హ్యాండ్ కూడా ఉంది. నాని కోసం ఓ క‌థ రెడీ చేసి యేడాదిగా ప‌డిగాపులు కాస్తున్నాడు. చివ‌రికి నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ప్ర‌స్తుతం క‌థానాయిక‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ గురించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు ప‌ర‌శురామ్ కూడా నానితో ఓ సినిమా చేయ‌డానికి వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు. ఇది వ‌ర‌కే నాని కోసం ప‌ర‌శురామ్ ఓ క‌థ త‌యారు చేసుకొన్నాడ‌ట‌. అల్లు అర‌వింద్ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. శ్రీ‌ర‌స్తు – శుభ‌మ‌స్తుతో ఫామ్ లోకి వ‌చ్చిన ప‌ర‌శురామ్ నానిని ప‌డితే… బంప‌ర్ ఆఫ‌ర్ చేజిక్కిన‌ట్టే. నాని కోసం గురు శిష్యులిద్ద‌రూ ట్ర‌యిల్ వేస్తుంటే ఆ ఆఫ‌ర్ ముందుగా శిష్యుడ్ని వ‌రించ‌డం విశేషం. మ‌రి గురువుగారి ఛాన్స్ ఎప్పుడొస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close