మీడియా వాచ్ : ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలూ అంతే !

హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడిరాష్ట్రం ఉన్నప్పుడు ఈ ప్రెస్ క్లబ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రెస్ క్లబ్ ప్రాధాన్యం .. జర్నలిస్టుల మద్యం అవసరాలు తీర్చడానికే పరిమితం అవుతోంది. అయినప్పటికీ ఆ క్లబ్‌ ఎన్నికలు మాత్రం ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉన్నాయి. ప్రెస్ క్లబ్ సభ్యులందరూ జర్నలిస్టులే. ఎవరూ ఆగర్భ శ్రీమంతులు కాదు. జీతాల మీద ఆధారపడేవారే. అయితే తమ నైపుణ్యంతో కొంత మంది ఆర్థికంగా స్థిరపడి ఉండవచ్చు. వారిలో ఉత్సాహం ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

ప్యానల్స్‌గా ఏర్పడ్డాయి.. ఇండిపెండెంట్‌గానూ పోటీ పడుతున్నారు. అయితే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో కూడా ” ఎన్నికల వైపరీత్యం ” కనిపిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం ..అలవి మాలిన హామీలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. పోటీ చేసేవారు ఒక్కొక్కరు పది లక్షల వరకూఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంత ఖర్చు పెట్టడానికి జీతాల మీద ఆధారపడే జర్నలిస్టులకు డబ్బులెక్కవడినే మౌలిక ప్రశ్న అందరికీ వస్తుంది.దానికి ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. ఇంతా చేసి గెలిచి న తర్వాత ఏం సాధిస్తారు అంటే చెప్పడానికి ఏమీ ఉండదు. ఓ పదవి అనే కిరీటం తప్ప.

కొసమెరుపేమిటంటే… ఈ ప్రెస్ క్లబ్‌లో అందరూ పాతతరం జర్నలిస్టులే. కొత్త వారిని గడప కూడా తొక్కనీయరు. కొత్త వారంటే పదిహేనేళ్ల కిందట జర్నలిస్టులు అయిన వారిని కూడా సభ్యులు కానివ్వరు.. సభ్యులు కావాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. అందుకే ప్రెస్‌ క్లబ్‌లో అందరూ సీనియర్లే ఉంటారు. వారి గుప్పిట‌్లోనే ఉంటారు. పలుకుబడి పెంచుకోవడానికి ఈ పదవుల్ని అడ్డం పెట్టుకుంటారు కానీ జర్నలిస్టుల సంక్షేమానికి చేసేది శూన్యం. చివరికి ప్రెస్ క్లబ్ సభ్యులకు కూడా. అయినా ఎన్నికలంటే అదో హడావుడి. ఇప్పుడు అదే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close