ప్రేమకథ షూటింగులో ప్రభాస్!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ ప్రస్తుతం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. అందులో ఓ పడవ పెద్దది… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహో’. అందుకని, ఆ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మధ్య మధ్యలో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించిన ప్రేమకథ షూటింగ్ చేస్తున్నాడు. ఇది ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇరవైయ్యో సినిమా. రెండూ సొంత మనషుల సినిమాలే కాబట్టి సమస్యలు ఎదురు కావడం లేదు.

నిన్న మొన్నటి వరకూ ‘సాహో’ షూటింగ్ చేసిన ప్రభాస్, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆదివారం కృష్ణంరాజు పుట్టినరోజు కాబట్టి షూటింగుకు సెలవు ప్రకటించార్ట‌. 2019లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఈ షెడ్యూల్‌తోనే మొదలు. ఇంతకుముందు రోమ్‌లో ఓ షెడ్యూల్, తరవాత హైద‌రాబాద్‌లో కొన్ని రోజులు చిత్రీకరణ చేశారు. ప్రేమకథ కనుక దర్శకుడు రాధాకృష్ణ చకచకా సన్నివేశాలు తీస్తున్నార్ట‌. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close