గోపీకృష్ణ‌ని రంగంలోకి దింపిన ప్ర‌భాస్‌

కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌. ప్ర‌భాస్‌తో `బిల్లా` తెర‌కెక్కించింది ఈ సంస్థే. అప్ప‌ట్లో `బిల్లా` బాగానే ఆడినా… లాభాల్ని మాత్రం పొంద‌లేక‌పోయింది. ఇప్పుడు ఆరుణం తీర్చుకోబోతున్నాడు ప్ర‌భాస్. త‌న కొత్త సినిమాలో పెద‌నాన్న‌కీ భాగ‌స్వామ్యం క‌ల్పించాడు. ప్ర‌భాస్ – రాధాకృష్ణ సినిమా యూవీ క్రియేష‌న్స్‌లో జ‌ర‌గ‌బోతోంద‌ని ఎప్పుడో డిసైడ్ అయ్యింది. యూవీ మాత్ర‌మే ఈ చిత్రాన్ని టేక‌ప్ చేస్తుంద‌నుకుంటే… ప్ర‌భాస్ గోపీకృష్ణ‌నీ రంగంలోకి దించాడు. త‌న పెద‌నాన్న‌ని ఓ నిర్మాత‌ని చేశాడు. ప్ర‌భాస్ కున్న స్టామినా ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి త‌ర‌వాత‌.. త‌న రేంజ్ ప‌ది రెట్లు పెరిగింది. యూవీ కూడా త‌న సొంత బ్యాన‌రే. కానీ.. పెద‌నాన్న కృష్ణంరాజు సంతృప్తి కోస‌మే… గోపీకృష్ణ పేరుని కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాని గోపీకృష్ణ‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌భాస్ పారితోషిక‌మే పెట్టుబ‌డిగా పెడుతున్నాడ‌ని లాభాల్లో వాటా అందుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ సినిమా కాబ‌ట్టి భారీ లాభాల‌కే ఈ సినిమా అమ్ముకోవొచ్చు. త‌ద్వారా పెద‌నాన్న కృష్ఱంరాజుకీ లాభాల్లో మంచి భాగ‌మే ద‌క్క‌బోతోంది. ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. `సాహో` త‌ర‌వాతే. షూటింగ్ అని ప్ర‌చారం సాగినా… రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం అతి త్వ‌ర‌లో మొద‌లెట్ట‌బోతున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించేసింది. సో.. అటు సాహో.. ఇటు రాధాకృష్ణ సినిమాలు స‌మాంతరంగా షూటింగ్ జ‌రుపుకుంటాయ‌న్న‌మాట‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com