105 మంది అభ్యర్థుల జాబితా..! 100 సీట్లు గెలుస్తాం : కేసీఆర్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ముందస్తు ఎన్నికల విషయంలో జెట్‌ స్పీడ్‌తో ఉన్నారు. ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా గవర్నర్‌కు తీర్మానం ఇచ్చి.. మళ్లీ అలా తెలంగాణ భవన్‌కు వచ్చి 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ముందుగా చెప్పినట్లుగా సిట్టింగ్‌లందరికీ దాదాపుగా టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరికి మాత్రమే మొండి చేయి చూపారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు మాత్రం టిక్కెట్లు నిరాకరించారు. బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధోల్ నుంచి.. జర్నలిస్ట్ క్రాంతికి టిక్కెట్ ఇచ్చారు. మంచి మనసుతో.. మంచి ముహుర్తంతో నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని.. కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాలతో పాటు నవంబర్‌లోనే ఎన్నికలు వస్తాయని.. కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న దానిపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ తెలంగాణ మాత్రం.. ఈ నాలుగున్నరేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించనంత అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ అభివృద్ధి ఆగకుండా ఉండటానికే.. ముందస్తుకు వెళ్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తాము నిర్వహించిన సర్వేల్లో వంద సీట్లు వస్తాయని కచ్చితంగా తేలిందని కేసీఆర్ స్ఫష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాదు కదా..అన్ని పార్టీలు కలిసినా.. తమ దరిదాపుల్లో కూడా లేరని.. కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి నివేదన సభ… సక్సెస్ అయిందని స్పష్టం చేశారు. 30వేల మంది వాహనాలు వచ్చిన సభను… ఫ్లాప్ అయిందని ఎలా చెబుతారని కేసీఆర్ జర్నలిస్టుల్ని ప్రశ్నించారు. అలా అన్న వారి బుర్రే దివాbe తీసిందన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో చెణుకులు విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలపై సెటైర్లు వేశారు. వేలం పాటలా.. కేసీఆర్ వంద అంటే.. కాంగ్రెస్ వాళ్లు రెండు వందలు అంటున్నారని.. సాధ్యమయ్యే హామీలేమీ ఇవ్వడం లేదని .. కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుంజుకుంటుందని… కేసీఆర్ ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో అయినా ఇరవై పార్లమెంట్ సీట్లు సాధించే స్థితి కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. రేపట్నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. హుస్నాబాద్‌లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో ఎన్నికల సమరానికి టీఆర్‌ఎస్ అధినేత శంఖారావం పూరించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close