చైతన్య : హీరోల సంగతి సరే .. మీ “నోరే”మైంది నాగబాబూ !?

తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాకు ఏపీలో ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించే సరికి తట్టుకోలేకపోయిన నాగబాబు చాలా రోజుల తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. అందులో తన తమ్ముడికి ఇతర హీరోలు సపోర్ట్ రాలేదని ప్రభుత్వంపై విరుచుకుపడలేదని చాలా పెద్ద పెద్ద మాటలే అన్నారు. ఆయన ఇతరుల్ని అన్నారు కానీ.. తమ వైపు చూపిస్తున్న వేళ్లను మాత్రం చూసుకోలేకపోయారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. నాగబాబు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. “మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు” అన్న పద్దతిలో ఉంటే అందరూ అదే పద్దతిలో ఉంటారన్న సంగతిని నాగబాబు మర్చిపోయారు.

హీరోలు సరే సోదరుడి కోసం మీరు నోరెందుకు ఎత్తలేదు నాగబాబు గారూ !

మాట కంటే ముందే వీడియోలో హడావుడి చేసి.. గొప్ప రివల్యూషనిస్ట్ అన్నంతగా హడావుడి చేసే నాగబాబు ఎందుకో ఇటీవలి కాలంలో చల్లబడిపోయారు. సొంత కుటుంబంపై ఏపీ ప్రభుత్వం దాడి చేస్తున్నా..నోరెత్తడంలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత వరకూ నాగబాబు ఎప్పుడైనా ప్రశ్నించారా ? పోనీ పవన్ కల్యాణ్ సినిమాలపై దాడులు చేస్తున్నప్పుడైనా స్పందించారా ? ఒక్క సారి కూడా ఎందుకు నోరెత్తలేదు. పవన్ కల్యాణ్‌ను కులం పేరు పెట్టి తిడుతున్నప్పుడు కూడా నోరు తెరవకుండా ఇప్పుడు ఇతరులు నోరు తెరవలేదని నిందలేయడం ఏమిటి నాగబాబు గారూ..!

గత ఏడాది ఏప్రిల్‌లో జగన్ మంచోడన్నది మీ నోరే కదా !?

ఇక్కడ ఓ విషయం గుర్తు తెచ్చుకోవాలి. ఇదే పవన్ కల్యాణ్‌పై.. వకీల్ సాబ్ సినిమా విషయంలోనూ అడ్డగోలుగా రాత్రికి రాత్రి జీవో తెచ్చి దాడులు చేస్తూంటే… అప్పుడు నాగబాబు ఏమన్నారో గుర్తు చేసుకోవాలి. ” జగన్మోహన్ రెడ్డికేమీ తెలియదని అంటున్నారు. ఆయన పరిపాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉంటే .. ఇతరులు చేస్తున్నారని” గత ఏడాది ఏప్రిల్‌లో వ్యాఖ్యానించారు. అప్పుడు జగన్ మంచోడయితే ఇప్పుడు కూడా మంచోడే అవ్వాలి. ఎందుకంటే అప్పుడు జారీ చేసిన జీవోనే ఇప్పుడు అమలు చేస్తున్నారు. పాపం జగన్‌కేమీ తెలియదు.. అంతా అధికారులే చేస్తన్నారని చెప్పాలి. కానీ ఎందుకు ఇతరులు నోరు తెరవాలని కోరుకుంటున్నారు.

సినీ పరిశ్రమను జగన్ టార్గెట్ చేశారని ఇప్పుడు తెలిసిందా !?

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మెగా..మెగా అంటే ఇండస్ట్రీ అని రెచ్చిపోయిన మెగా క్యాంప్ సభ్యులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటప్పుడు ఇండస్ట్రీపై ఏపీ సీఎం అడ్డగోలుగా దాడి చేస్తున్న విషయం ఇప్పుడే తెలిసిందా..? మామూలుగా అయితే నాగబాబు.. ఇతర అంశాల్లో బుస్సుమని లేస్తారు. సందర్భం ఉన్నా లేకపోయినా బాలకృష్ణ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వార్తల్లోకి వస్తూంటారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు… అయినదానికి.. కాని దానికి విమర్శలు చేసేవారు. అప్పుడు ఆయనకు ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు లేదు. అది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కానీ మాకోసం ఎవరూ రాలేదని ఏడిస్తే ఏం ప్రయోజనం.

అంతా చేజేతులా చేసుకున్నదే.. అనుభవించి తీరాలి !

చేసుకున్నవాడికి చేసుకున్నంత అనే ఓ సామత ఉంది. మంచోడిపై నిందలేని అడ్డగోలు ఆరోపణలు చేసి.. ఎన్ని నిందలేసినా ప్రజాస్వామికంగా ఉంటాడు.. ఏమీ చేయడనే భావనతో చెలరేగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడేం జరిగింది. తప్పు చేసిన వారే అనుభవిస్తున్నారు. అనుభవించాలి కూడా. డబ్బులు.. సినిమాలు.. నాగబాబు ఫ్యామిలీ అండ్ మిత్రులవే కాదు.. అందరివీ అలాంటివే. అందుకే నాగబాబుకు ఎంత టెన్షన్ ఉంటుందో మిగతా వారికీ అంతే ఉంటుంది. ఇక్కడ అందరూ కలిసి కొట్లాడాలంటే ఎవరి సినిమా విడుదలైనప్పుడు వారు మాట్లాడుకోవడం కాదు. అందరూ కలిసి ఒకే సారి మాట్లాడాలి.. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది పోరాడాలి. కానీ పోరాటం అంటే నాగబాబు ముందుకొస్తారా ? వచ్చే వారయితే గత ఏప్రిల్‌లోనే జగన్ మంచోడనే మాటను ఆయన అని ఉండేవారు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close