రాజ‌శేఖ‌ర్ విల‌న్ కాదా?

నితిన్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం ఎక్స్‌ట్రా.. ఆర్డిన‌రీ! వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌న్న సంగతి తెలిసిందే. రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నాడ‌న‌గానే.. అది విల‌న్ రోల్ అనుకొన్నారంతా. అయితే.. `ఎక్స్ ట్రా`లో రాజ‌శేఖ‌ర్ విల‌న్ కాదు. ఓ పాత్ర అంతే! ఇందులో రాజ‌శేఖ‌ర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని టాక్‌. హీరోని స‌పోర్ట్ చేసే కీ రోల్ అది.

నిజానికి రాజ‌శేఖ‌ర్‌కి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ రోల్స్ ఇది వ‌ర‌కు చాలాసార్లు వ‌చ్చాయి. విల‌న్ రోల్ ఆఫర్లూ అందాయి. కానీ దేనికీ ఒప్పుకోలేదు. ఇన్నాళ్ల‌కు మ‌న‌సు మార్చుకొన్నాడు. అయితే స్ట్ర‌యిట్ గా విల‌న్ పాత్ర‌లు చేస్తే బాగోదేమో అని ఫీల‌య్యాడేమో, ఓ పాజిటీవ్ క్యారెక్ట‌ర్ ఒప్పుకొన్నాడు. నిజానికి రాజ‌శేఖ‌ర్ విల‌న్ పాత్ర‌ల‌కు ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌వుతాడు. హీరోగా బ్రేక్ ఇచ్చి, ఓ సినిమా ఒప్పుకొన్న‌ప్పుడు ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ క్యారెక్ట‌ర్ లో ఎంట్రీ ఇస్తే బాగుండేది. మ‌రి రాజ‌శేఖ‌ర్ ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకొన్నాడో? శ్రీ‌లీల క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం డిసెంబ‌రులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హారీశ్ జయ‌రాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close