రామ్ చ‌ర‌ణ్‌ ‘ఫ్లాష్ బ్యాక్‌’.. ర‌క్త క‌న్నీరే!

శంక‌ర్ సినిమాలు టెక్నిక‌ల్ గా చాలా బాగుంటాయి. నిజానికి టెక్నాల‌జీని సినిమాలో ఇంత‌గా ఉప‌యోగించొచ్చా? అని ఆశ్చ‌ర్య‌పోయేలా దాన్ని వాడుకున్నాడు శంక‌ర్‌. పైగా త‌న సినిమాల‌న్నీ భారీ బ‌డ్జెట్ లే. అవ‌న్నీ క‌న్నుల పండుగ‌లా ఉంటాయి. కాక‌పోతే.. శంక‌ర్ ఎప్పుడూ ఎమోష‌న్ ని వీడ‌లేదు. త‌న తొలి సినిమా నుంచీ… ఆ పార్ట్ వ‌ద‌ల్లేదు. `జెంటిల్‌మెన్‌`లో ఓ మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అర్జున్ అలా ఎందుకు మారాడో అందులో చూపిస్తాడు. `భార‌తీయుడు`లోనూ గుండెలు బ‌రువెక్కించే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. `జీన్స్‌`లోనూ అంతే. త‌న ఫ్లాష్ బ్యాక్‌లే త‌న క‌థ‌ల‌కు మూలం అవుతాయి.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు శంక‌ర్. ఉద్యోగ వ్య‌వ‌స్థ తీరు తెన్నులు, ప్ర‌జ‌ల హ‌క్కుల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించే సినిమా ఇది. రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడు. అయితే… రామ్ చ‌ర‌ణ్ కి ఓ బ‌ల‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ట‌. అది చాలా భావోద్వేగ భ‌రితంగా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కుల్ని ఎమోష‌న్‌కి గురి చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ వ‌ల్లే… క‌థానాయ‌కుడి ల‌క్ష్యం పూర్తిగా మారుతుంద‌ని, క‌థ మ‌లుపు తిరుగుతుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. కొత్త షెడ్యూల్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే మొద‌లు కానుంద‌ని స‌మాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాణీ క‌థానాయిక‌. సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close