ఎన్టీఆర్ టూ.. ఎన్టీఆర్‌!!

సాయికుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది?? అత‌ను డైలాగ్ కింగ్‌. డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా మొద‌లైన అత‌ని ప్రయాణం హీరోగా మారి.. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా జామ్ జామ్ అంటూ సాగిపోతోంది. స‌హాయ‌న‌టుడిగా సాయికుమార్ బిజీగా ఉన్నాడు. తొలిసారి త‌న‌యుడు ఆదితో క‌ల‌సి చుట్టాల‌బ్బాయ్‌లో న‌టిస్తున్నాడు. అన్న‌ట్టు జ‌న‌తా గ్యారేజ్‌లోనూ సాయికుమార్‌కి మంచి పాత్ర ద‌క్కింది. ”అన్న‌గారు నంద‌మూరి తార‌క రామారావుగారితో ప‌నిచేశా. మ‌న‌వ‌డు ఎన్టీఆర్ తోనూ క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఆ ఎన్టీఆర్ నుంచి ఈ ఎన్టీఆర్ వ‌ర‌కూ క‌ల‌సి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమాల‌కు తెలుగులో నేను డ‌బ్బింగ్ చెప్పా. ఇప్పుడు అదే మోహ‌న్‌లాల్ తో న‌టించా. అదీ స్పెష‌ల్ మెమొరీనే” అంటున్నాడు సాయికుమార్‌.

త‌న‌యుడు గురించి చెబుతూ ”ఆది న‌టుడిగా నిరూపించుకొన్నాడు. ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లినా ‘ఆది బాగా చేస్తున్నాడండీ.. ఒక్క హిట్టు ప‌డితే చాలండీ’ అంటున్నారు. నాకూ అదే అనిపించింది. వాడి క‌ష్టం వాడు ప‌డుతున్నాడు.. అటుపై దేవుడి ద‌య‌” అని చెప్పుకొచ్చాడు. క‌న్న‌డ‌లో సాయి కుమార్ చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలున్నాయ‌ట‌. తెలుగులో ఆరు చిత్రాలున్నాయి. సాయి కంటే బిజీ ఆర్టిస్టు ఎవ‌రుంటారు చెప్పండి?? అన్న‌ట్టు బుధ‌వారం సాయికుమార్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చుట్టాల‌బ్బాయ్ స్పెష‌ల్ టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close