ఇసుక అక్ర‌మ మైనింగ్- జ‌గ‌న్ స‌ర్కార్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన ఆరోప‌ణ‌లు అనేకం.

కోర్టులు స్వ‌యంగా జోక్యం చేసుకొని… అక్ర‌మ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాల‌న్న ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోవ‌ట్లేదు. ఇదే అంశంపై సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయ్యింది. అక్ర‌మ మైనింగ్ ఆపాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి, అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందో లేదో నిర్ధారించాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే అక్ర‌మ మైనింగ్ పై చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్న ఏపీ వాద‌న‌ను తోసిపుచ్చిన కోర్టు, మీ ఆదేశాలు కేవ‌లం కాగితాల‌కే ప‌రిమితం అయ్యాయి అని వ్యాఖ్యానించింది.

అక్ర‌మ మైనింగ్ ఆప‌టం, యంత్రాల‌ను ఊప‌యోగించ‌కుండా అనుమ‌తి ఉన్న ప్రాంతాల్లో ఇసుక తీసుకోవాల‌ని సుప్రీం కోర్టు ఇప్ప‌టికే ఆదేశించింది. అయినా, యంత్రాల‌తో ఇసుక మైనింగ్ చేస్తున్నార‌ని, అక్ర‌మ మైనింగ్ కూడా జ‌రుగుతుంద‌ని ఆధారాల‌ను ఎన్జీవో నేత కోర్టు ముందుంచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close