బాల‌య్య‌తో త‌మ‌న్నా ఐటెమ్?

వ‌రుస హిట్ల‌తో బాల‌కృష్ణ ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. వీర సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాలు బాల‌య్య అభిమానుల్నే కాదు, స‌గ‌టు ప్రేక్ష‌కుల్నీ అల‌రించాయి. ఇప్పుడు అంద‌రి దృష్టీ బాల‌య్య – బాబీ కాంబోపైనే. బాబీ కూడా `వాల్తేరు వీర‌య్య‌`తో త‌న స‌త్తా చాటాడు. ఇప్పుడు బాల‌య్య‌ని ఫుల్ మాసీ రోల్ లో చూపించే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఈ సినిమాని బాల‌య్య అభిమానుల‌కు ఓ ట్రీట్ లా ఇవ్వాల‌న్న‌ది బాబీ ప్ర‌య‌త్నం. అందుకే అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకొంటున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఊర్వ‌శీ రౌటాలా ఆల్రెడీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. మీనాక్షి చౌద‌రి కూడా దాదాపుగా ఖ‌రారైంది. మూడో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలాల్సివుంది.

ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరిన‌ట్టు టాక్‌. త‌నే త‌మ‌న్నా. ఈ సినిమాలో త‌మ‌న్నాతో ఓ ఐటెమ్ సాంగ్ చేయించాల‌ని బాబీ భావిస్తున్నాడు. బాల‌య్య – త‌మ‌న్నా కాంబో ఇప్ప‌టి వ‌ర‌కూ సెట్ కాలేదు. ఈ సినిమాతో.. ఈ జోడీని తెర‌పై చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది. త‌మ‌న్నా ఐటెమ్ గీతాల స్పెష‌లిస్టు. ఈ యేడాది జైల‌ర్ లో తాను చేసిన ఐటెమ్ గీతం బాంబులా పేలిన సంగ‌తి తెలిసిందే. మ‌రి బాల‌య్య‌తో త‌న జోడీ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close