రెండో వన్డే పాయే..! కివీస్‌కు వైట్‌వాష్ ప్రతీకారం చాన్స్..!

ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి… తిరుగులేదనుకున్న టీమిండియా.. వన్డేల్లో బోల్తా పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో.. న్యూజిలాండ్‌కు వైట్ వాష్ చేసి.. కసి తీర్చుకునే అవకాశం కల్పించింది. తొలి రెండు వన్డేల్లో ఘోరపరాజయం పాలయింది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా పరాజయం పాలైన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఓ మాదిరి స్కోరును కూడా.. చేజింగ్‌లో అందుకోలేకపోయింది. టాపార్డర్ మొత్తం కుప్పకూలింది. టెయిలెండర్లు ఆశలు రేపినా.. అది విజయం వరకూ రాలేదు. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..టీమిండియా సిరీస్‌ని కోల్పోయింది. వైట్ వాష్ ప్రమాదంలో పడింది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు.

సూపర్ ఫామ్‌ లో ఉన్న రాస్ టేలర్ 74 బంతుల్లో 73 పరుగులు, గప్తిల్ 79 పరుగులు చేసి… ఇన్నింగ్స్ కి పిల్లర్లులా నిలిచారు చివరికి 50 ఓవర్లలో కివీస్ 273 పరుగులు చేయగలిగింది. చేజింగ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అతి విశ్వాసానికి పోయారు. ఫలితంగా స్కోర్ బోర్డుపై వంద పరుగులు చేరకుండానే… ఐదు వికెట్లు పడిపోయాయి. తొలి ఆరుగురు ఆటగాళ్లలో ఒక్క అయ్యర్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశారు. 153 పరుగుల వద్ద ఏడో వికెట్ పడటంతో.. పరాజయం ఖాయమనుకున్నారు. కానీ రవీంద్ర జడేజా… సైనీ.. సాధికారికంగా ఆడుతూ ఆశలు పెంచారు.

కానీ.. 229 పరుగుల వద్ద సైని… కాసేపటికే చాహల్ కూడా వెనుదిరగడంతో…పరాజయం ఖాయమయింది. 55 పరుగులు చేసిన జడేజా.. చివరి వికెట్ గా వెనుదిరిగారు. దాంతో ఘోరపరాజయం ఖాయమనుకున్న టీమిండియాకు 22 పరగుల తేడాతో ఓడి.. కాస్త పరువు నిలుపుకుంది. మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. టీ ట్వంటీల్లో తిరుగులేదనుకున్న ఆటతీరు చూపిన టీమిండియా.. వన్డేల్లో తేలిపోవడం.. అభిమానులను నిరాశ పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close