మోడీ, అమిత్ షా… తప్పు మీద తప్పు

విన్నింగ్ కాంబినేషన్ కాస్తా, ఓటమికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీ, ఇప్పుడు పార్టీని గెలిపించలేకపోతున్నారు. యూపీలో అద్భుతాలు చేసిన అమిత్ షా వ్యూహ చతురత వెలవెలబోతోంది. ఢిల్లీ తర్వాత బీహార్లోనూ ఈ జోడీ బీజేపీని గెలపించలేకపోయింది.

బీహార ప్రచారంలో ఎటు చూసినా మోడీ, అమిత్ షానే కనిపించారు. పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్ల నిండా వీరి ఫొటోలే. మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోనూ వీరి చిత్రాలే. బీహార్ కు చెందిన బీజేపీ నేతల ముఖాలు పెద్దగా కనిపించడం లేదు. అందుకే, బీహారీ, బాహరీ అన్న నితీష్ కుమార్ నినాదం ప్రభావం చూపింది. ఇది బీహారీలకు, బయటి వారికీ మధ్య పోటీ అన్నది నితీష్ వ్యూహాత్మక నినాదం. బీజేపీ అనాలోచిత వ్యూహాల వల్లే అదే నిజమని రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్మారు.

ఢిల్లీలో క్లీన్ ఇమేజి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై విపరీతమైన విమర్శలు చేయడం వికటించింది. ఆమ్ ఆద్మీ పార్టీపై మిగిమీరి నెగెటివ్ ప్రచారం చేయడం ఒక దశలో కొందరు బీజేపీ నేతలకే ఏవగింపు కలించింది. సీఎం అభ్యర్థిగా ఆగమేఘాల మీద కిరణ్ బేడీని దిగుమతి చేయడం ప్లస్ పాయింట్ కాలేదు. బీజేపీ ప్రచార ఆర్భాటం, అట్టహాసం, మోడీ 10 లక్షల సూట్ వివాదం కూడా ఢిల్లీలో ప్రభావం చూపాయి. బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి బీజేపీ గుణపాఠం నేర్వలేదు.

బీహార్లోనూ నితీష్ కుమార్ అనే క్లీన్ ఇమేజి గల ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన్ని ఢీకొనేటప్పుడు సంయమనం పాటించాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నితీష్ ను టార్గెట్ చేయకుండా, అవినీతి కేసులో జైలు శిక్ష పడిన లాలు జంగల్ రాజ్ అంశాన్ని టార్గెట్ చేసి ఉంటే మరోలా ఉండేది. తాము గెలిస్తే ఏం చేస్తామనేది చెప్తూ, నెగెటివ్ ప్రచారం జోలికి వెళ్లకపోతే హుందాగా ఉండేది. కానీ నితీష్ పై మితిమీర విమర్శలు చేశారు. ఇదీ వికటించింది. యూపీలో దాద్రీ ఘటన, బీఫ్ వివాదంలో బీజేపీతో పాటు సంఘ్ పరివార్ నేతలు తీవ్రమైన కామెంట్లు చేయడం బీజేపీ కొంప ముంచింది. వారిని కంట్రోల్ చేయలేని మోడీ, అమిత్ షాలు నిస్సహాయంగా ఉండిపోయారు.

సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం అతిపెద్ద తప్పిదం. నితీష్ సుపరిపాలన అందించిన సీఎం అని పేరుంది. ఆయనకు పోటీ ఎవరనేది తెలుసుకుని, ఇద్దరినీ బేరీజు వేసుకుని చూసే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. నితీష్ లాగే క్లీన్ ఇమేజి ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించారు. అదీ జరగలేదు. ఎన్నికల తర్వాతే ప్రకటిద్దామని బీజేపీ భావించింది. ముందే ఆయన్ని ప్రకటిస్తే అగ్రవర్ణాల వారు, యాదవులు దూరమవుతారని కమలనాథులు ఈ ఎత్తు వేశారు. చిత్తయ్యారు ప్రచార పర్వంలో సుశీల్ మోడీ ఫొటోలను కూడా విస్తృతంగా వాడలేదు. మిగతా నేతలకు కోపం వస్తుందని బీజేపీ భయపడింది. చివరకు బీహారీలు బీజేపీ ప్రచారం వైపు చూస్తే బయటి వారు… అంటే మోడీ, అమిత్ షానే కనిపించే వారు. అందుకే, నితీష్, లాలునే బెటర్ అనుకున్నారు. కాబట్టే లాలు ఆటవిక రాజ్యం అనే అంశాన్ని కూడా పక్కనబెట్టారు.

నితీష్ కుమార్ వదిలించుకున్న జీతన్ రాం మాంజీని కూటమిలో చేర్చుకుని, స్థాయికి మించి సీట్లను కేటాయించింది బీజేపీ. ఎన్డీయేలోని మిగతా మూడు పార్టీలకూ ప్రజల్లో పెద్దగా పట్టులేదు. అయినా వాటికి 80 సీట్లకు పైగా బీజేపీ వదిలిపెట్టడం కూడా దెబ్బతీసింది. రాష్ట్రాన్ని బట్టి రణనీతి మారాలి. సందర్భాన్ని బట్టి వ్యూహరచన చేయాలి. ఎంతసేపూ మోడీని చూసే ఓటేస్తారని గుడ్డిగా భ్రమపడితే ఇలాగే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close