న్యూడ్ సీన్స్ అఫిషియల్‌గానే లీక్ చేశారు…ఇట్స్ క్లియర్

ఇండియాలో వందలాది మంది హీరోయిన్స్ ఉండగా కేవలం రాధికా ఆప్టేకు సంబంధించిన న్యూడ్ సీన్సే ఎందుకు లీక్ అవుతున్నాయి? రాధికా ఆప్టేనే వాంటెడ్‌గా చేస్తోందనే అనుమానాలున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. వాళ్ళ అభిప్రాయాలు కరెక్టే అని ఈ రోజు రాధికా ఆప్టే ఇచ్చిన క్లారిటీతో కన్ఫర్మ్ అయింది. భారతదేశ చట్టాల ప్రకారం అలాంటి వీడియోలను అఫిషియల్‌గా రిలీజ్ చేయటం నిషిద్ధం. అందుకే తెలివిగా వాళ్ళే నెట్‌లో లీక్ చేసేశారు. అప్పటి నుంచి తీవ్రమైన విమర్శలు ఎన్నో వచ్చిన తర్వాత రాధికా ఆప్టే సినిమాకు సంబంధించిన ఒక్కొక్కళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు. హీరోగారేమో ఆ వీడియోలను రాధికా ఆప్టే వీడియోలు అని ఎందుకు చెప్తున్నారు. అదే వీడియోలో నేను కూడా ఉన్నాను కదా..? నా వీడియోలు అని ఎందుకు చెప్పరు? అని చాలా అమాయకంగా ఓ ప్రశ్న అడిగారు. ఆ తర్వాత డైరెక్టర్‌గారు కూడా రాధికా ఆప్టే తన సొంత బంధువు అనే రేంజ్‌లో ఓ భారీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు.

ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన రాధికా ఆప్టే సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఆ న్యూడ్ సీన్స్ చేసేటప్పుడు అమ్మడు సౌకర్యంగానే ఉందట. అందుకనే ఆ సీన్లు చేసినందకు తనేమీ ఫీలవ్వడం లేదట. రెగ్యులర్‌గా నేను అలాంటి సీన్స్‌లోనే కనిపిస్తున్నాను కాబట్టే నా వీడియోలే లీక్ అవుతున్నాయోమోనని చెప్పింది. అయితే సినిమాకు న్యూడ్ సీన్ అవసరం అని తనకు అనిపిస్తేనే అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేస్తుందట. టూ పీస్ బట్టలేసుకుని, కెమేరా ముందు డ్యాన్సులేసి జనాలకు చూపెట్టడం అనేది అసభ్యత అవుుతుందట. కానీ అమ్మడు చేసిన న్యూడ్ సీన్ మాత్రం కళగా చూస్తే అసభ్యంగా కనిపించదట.

రాధికా ఆప్టే వివరణ వినగానే తెలుగులో ఉండే ఓ నాటు సామెత గుర్తొచ్చింది కానీ ఇక్కడ రాయడం సభ్యతగా అనిపించడం లేదు. మసాలా సాంగ్స్‌లో డ్యాన్సులేసే హీరోయిన్స్ కంటే న్యూడ్ సీన్స్ చేసే నేను చాలా బెటర్ అని చెప్పి.. తన తప్పును సమర్థించుకోగలనన్న గొప్ప ఆలోచన రాధికాకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ట్ సినిమా అని చెప్పుకు తిరిగే చాలా మంది న్యూడ్ సీన్స్‌పైన డిపెండ్ అవుతూ ఉంటారు. అది కచ్చితంగా తప్పే. స్త్రీలను ఆట వస్తువుగా చూపించే సంస్కృతి నుంచి వచ్చిందే ఆ పద్ధతి. మళ్ళీ స్త్రీల సమస్యలను చూపించడానికే తప్పని సరి పరిస్థితుల్లో తీయాల్సి వచ్చిందని ఓ అర్థం లేని వివరణ ఇస్తారు. తెరపైన ఎలాంటి ఎమోషన్ పండించడానికై…నా మన ఆలోచనల్లో సత్తా ఉంటే న్యూడిటీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మాస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి, ఆర్ట్ సినిమాల్లో న్యూడ్ సీన్స్‌కి డిఫరెన్స్ ఏమీ లేదు.

ఇక రాధికా ఆప్టే సీన్స్ మాత్రం కావాలనే లీక్ చేశారు అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే తన సుదీర్ఠ వివరణలో ఎక్కడా కూడా పోలీసులను అప్రోచ్ అవుతాననిగానీ, తప్పు చేసిన వాళ్ళను కోర్టుకు లాగుతానని గానీ చెప్పలేదు రాధికా ఆప్టే. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే లీక్ అయిన రాధికా ఆప్టే న్యూడ్ సీన్స్‌కి మరింత పబ్లిసిటి తీసుకురావడానికే రాధికాతో సహా యూనిట్ మొత్తం కూడా కృషి చేస్తున్నట్టుంది. వీళ్ళు మళ్ళీ సమాజాన్ని ఉద్ధరించడానికే ఆ కళాత్మక సన్నివేశాన్ని తీశామని అర్థం లేని వివరణ ఇవ్వడాన్ని చూస్తుంటే ఎలా విమర్శించాలో కూడా తెలియడం లేదు. కానీ ఇలాంటి చర్యల వళ్ళ రాధికా ఆప్టే ఇమేజ్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుందే తప్పించి కలిసొచ్చేదైతే ఏమీ ఉండదు. మొత్తం ఎపిసోడ్‌ని అబ్జర్వ్ చేస్తుంటే ఓ విషయం మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులకు ఏ మాత్రం తీసిపోరని. రాధికా కూడా ప్యూచర్‌లో రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close