‘పెళ్లి చూపులు’ ఎఫెక్ట్ మామూలుగా లేదు

ఒక సినిమా…. ఒకే ఒక్క సినిమా… చిన్న చిత్రాల‌కు మాంఛి ఊపు తెచ్చింది. లో బ‌డ్జెట్ చిత్రాల ముఖ చిత్ర‌మే మార్చేసింది. ఆ సినిమానే… పెళ్లి చూపులు. ఓవ‌ర్సీస్‌లో చిన్న సినిమాకంటూ ఓ చోటు ఇచ్చింది పెళ్లి చూపులు. ఇది వ‌ర‌కు అక్క‌డ బ‌డా సినిమాల‌దే రాజ్యం. కానీ పెళ్లి చూపుల‌తో ఆ సీన్ మారింది. కేవ‌లం రూ.60 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో తీసిన సినిమా ఇది. ప‌బ్లిసిటీకి మ‌రో అర‌వై అయ్యిందంతే. ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా ఏకంగా 7 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాని కొన్న బ‌య్య‌రు లాభాల వాన‌లో త‌డిసి ముద్ద‌య్యాడు. దాంతో… ఇక మీదట రాబోయే చిన్న సినిమాల‌పై జ‌నాల ఫోక‌స్ పెరిగింది. పెళ్లి చూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ద్వార‌క‌’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి చూపులు విడుద‌ల‌కు ముందే స‌గం సినిమా పూర్త‌య్యింది. కానీ ఆ సినిమాని ఎవ్వరూ ప‌ట్టించుకోలేదు. పెళ్లిచూపులు హిట్ట‌య్యిందో లేదో.. ద్వార‌క వెలుగులోకి వ‌చ్చింది.

సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఆ సంస్థ‌కు ఉన్న బ్రాండ్ వాల్యూ, పెళ్లి చూపులతో కొట్టిన హిట్టు ద్వార‌క‌కు ప్ల‌స్ అయ్యాయి. దాంతో… ఓవ‌ర్సీస్ నుంచి ఈ సినిమా కోసం పోటీ మొద‌లైంది. క‌నీసం 1.5 కోట్ల‌కు త‌గ్గ‌కుండా బేరం తెగే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. అది ఆల్మోస్ట్‌.. ఈ సినిమా కోసం పెట్టిన పెట్టుబ‌డి అని టాక్‌. అంటే.. బ‌డ్జెట్ మొత్తం ఓ ఏరియా బిజినెస్‌తో వ‌చ్చేస్తోంద‌న్న‌మాట‌. అంత‌కంటే హ్యాపీ న్యూస్ ఇంకేముంటుంది? ద్వార‌క అనే కాదు.. శ‌ర్వానంద్‌, నాని, నాగ‌శౌర్య‌లాంటి చిన్న హీరోల సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో మంచి మార్కెట్ ఏర్ప‌డడానికి పెళ్లిచూపులుగ‌ట్టి బీజం వేసింది. మంచి కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొనే చిన్న సినిమాల‌కు ఇది పండ‌గ‌లాంటి వార్తే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close