అప్పుడు పనామా..ఇప్పుడు పండోరా పేపర్లు !

పనామా పేపర్ల పేరుతో గతంలో లీకయిన ప్రముఖుల విదేశీ లావాదేవీల వ్యవహారాలు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటిదే పండోరా పేపర్ల పేరుతో అంతర్జాతీయ పరిశోధన జర్నలిస్టుల గ్రూప్ కొన్ని డాక్యుమెంట్లలో వెలుగులోకి తెచ్చింది. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీల అక్రమ లావాదేవీల గుట్టు ఉంది. భారత్‌కు చెందిన 380 మంది వ్యవహారాలు పండోరా పేపర్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంత మంది వివరాలు బయటకు వచ్చాయి. ఆరుగురు మాజీ ఎంపీలు భారీగా విదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారుని పండోరా పేపర్స్‌ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

ఇండియాలో దివాలా తీసిన అనిల్ అంబానీ విదేశాల్లో 18 ఆఫ్‌షోర్‌ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేస్తున్నట్లుగా పండోరా పేపర్స్ చెబుతున్నాయి. సచిన్‌ టెండుల్కర్‌కు కూడా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఓ ట్రస్టు ఉందట. నీరవ్‌ మోడీ కూడా ఓ ట్రస్టును ఏర్పాటుచేసి మరీ పారిపోయారు. భారత్‌ నుంచి లిస్టులో ఉన్న వారిలో అత్యధిక మంది సీబీఐ, ఈడీ కేసులు, ఆర్థిక నేరాల కేసుల్లో ఉన్న వారేనని తెలుస్తోంది. వీరిలో వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు.

వీరంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును పన్ను ఎగవేత దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు, కంపెనీల్లో దాచుకుంటున్నారని చెప్పడమే పండోరా పేపర్స్ లీకుల ఉద్దేశం. ఆ ట్రస్టులు, కంపెనీల అసలు యజమానులెవరో తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకూ సాధ్యం కాదట. సంక్లిష్టంగా ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ట్రస్టుల నిర్మాణం ఉంటుందని వారి అక్రమ సంపాదన సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో ఇలా బయటకు వస్తున్న పేపర్లపై ప్రభుత్వాలు దర్యాప్తు చేయించడంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close