టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ : జగన్‌ ఫిర్యాదు కుట్రగా తేల్చిన సుప్రీంకోర్టు..!

ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా … సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సీజేఐతో పాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జరిపిన విచారణ వివరాలను పాక్షికంగా వెల్లడించింది. సుప్రీంకోర్టు ఇన్‌హౌస్ విచారణ జరిపింది. పబ్లిక్‌కు వెల్లడించడం సాధ్యం కాదనిప్రకటించింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం… జరిగిన విచారణపై పాక్షిక వివరాలను వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. సీఎం జగన్మోహన్ రెడ్డి.. జస్టిస్ ఎన్వీ రమణపై చేసిన అభియోగాలను.. సుప్రీంకోర్టు సీజేఐ ఎస్‌ఏ బోబ్డే ఆషామాషీగా తీసుకోలేదు. అంతర్గత విచారణ చేయించారు. సీజేఐ బోబ్డేతో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జగనమోహన్ రెడ్డి చేసిన ప్రతీ ఆరోపణనూ పరిశీలించారు.

ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు జస్టిస్ రమణ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న భూముల గురించి… మరొకరు.. అధికార దుర్వినియోగ ఆరోపణల గురించి పరిశీలన జరిపారు. వారిద్దరూ… అతి సుదీర్ఘమైన తమ పరిశీలనా నివేదికను సీజేఐకి సమర్పించారు. భూముల విషయంలో ఎన్వీ రమణ రాజధాని ప్రకటన తర్వాతనే… అంటే 2015లో కొనుగోలు చేశారని… న్యాయమూర్తి గుర్తించారు. అంతే కాదు.. ఆ విషయంపై.. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ ” తప్పుడు.. ఆధారాలు లేని..కుట్రపూరితంగా.. ఉద్దేశపూర్వకంగా” చేసిన ఆరోపణలుగా నిర్ధారించారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చేలా ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిని విధులు నిర్వహించకుండా చేసే ప్రయత్నంగానే న్యాయమూర్తి తన నివేదికలో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

జగన్మోహన్ రెడ్డి… ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిపై ఆరోపణలు చేస్తూ… ఆయనను జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరో సీనియర్ న్యాయమూర్తి పరిశీలన జరిపి సుదీర్ఘ నివేదిక సమర్పించారు. అది కూడా తప్పుడు ఆరోపణలేనని తేల్చారు. ఇద్దరు న్యాయమూర్తుల నివేదిక ఆధారంగా… జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదును డిస్‌మిస్ చేస్తూ.. సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను.. ప్రధాన న్యాయమూర్తి పదవికి పూర్తి అర్హునిగా నిర్ధారిస్తూ.. కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు.

న్యాయవ్యవస్థపై తప్పుడు.. నిరాధారణ ఆరోపణలు చేస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం… సీజేఐ ఆ లేఖపై ఇన్ హౌస్ విచారణ చేస్తున్నారని తెలిసిన తర్వాత… బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో మీడియాకు విడుదల చేయడం.. ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకుంటే న్యాయవ్యవస్థపై మరింతగా దాడి పెరుగుతుందని.. గతంలోనే న్యాయనిపుణులు విశ్లేషించారు. జగన్ చేసిన ఫిర్యాదు..దాన్ని మీడియాలో ప్రచారానికి పెట్టడం వంటివి భవిష్యత్‌లోనూ కీలక అంశాలుగా ఉంటాయని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close