మూడు కేక్‌వాక్‌… ఒక్కచోటే ఫోకస్‌!

తెలంగాణలో ఇప్పుడు గులాబీ పార్టీ మరో ఎన్నికల సమరానికి మరింత ఉత్సాహంతో సిద్ధం అవుతోంది. ఒక రకంగా ప్రతిపక్షాలు డీలా పడుతున్న సమయంలో.. అధికార పార్టీ మాత్రం.. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సిద్ధాంతం ప్రకారం చిన్న ఎన్నికలకు కూడా పెద్దస్థాయిలోనే తమ శక్తులను మోహరిస్తున్నది. తెలంగాణలో ప్రస్తుతం నాలుగు మునిసిపాలిటీలకు ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేట, అచ్చంపేటలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ నాలుగింటిలో మూడు చోట్ల తమకు విజయం సాధించడం అనేది నల్లేరుపై బండి నడక అని, ఒక్క చోట మాత్రం కాస్త ఫోకస్‌ పెంచి తమ బలాన్ని నిరూపించుకోవాలని తెరాస భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. వరంగల్‌, ఖమ్మం, సిద్ధిపేట విషయంలో తెరాసకు భిన్నాభిప్రాయం లేదు. ఇక్కడ ఎంత నిశ్చింతగా ఉన్నా గెలుస్తామనే ధీమా ఉంది. కాకపోతే అచ్చంపేటపై వారిప్పుడు ఫోకస్‌ పెడుతున్నారు. పాలమూరు జిల్లాలో పార్టీకి పెద్దగా బలం లేదనే వాదనల్ని తిప్పికొట్టడానికి ఈ ఎన్నికను వాడుకోవాలని చూస్తున్నారు.

మూడు స్థానాలపై వారు ధీమాగా ఉండడానికి చాలా కారణాలున్నాయి. వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికలో వారు ఇటీవలే ఎంత మెజారిటీ సాధించారో అందరూ గమనించారు. అది చారిత్రాత్మకమైన మెజారిటీ. ఆ తర్వాత.. పార్టీ ప్రాభవం పడిపోవడానికి ఇప్పటిదాకా జరిగిన దుశ్చర్యలేమీ లేవు. వరంగల్‌ గులాబీ పార్టీకి తిరుగులేని ఆధిక్యంతో కార్పొరేషన్‌ను కట్టబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే ఖమ్మం మీద కూడా వారికి ధీమా ఉంది. అక్కడ తొలిరోజుల్లో తమకు బలం లేకపోయినా.. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికను ఎంత సులువుగా చేజిక్కించుకున్నారో అంతా గమనించారు. తుమ్మల నాగేశ్వరరావు చక్రం తిప్పే ఖమ్మం నియోజకవర్గంలో.. ఖమ్మం కార్పొరేషన్‌ వైరి పార్టీలకు అభ్యర్థుల కోసం వెతుక్కునే పరిస్థితి సృష్టిస్తుందని అంతా అనుకుంటున్నారు. సిద్దిపేట విషయంలో ఇక చెప్పే పనిలేదు. హరీష్‌రావు పుణ్యమాని అది తెరాసకు ఎంతటి కంచుకోటగా మారిపోయిందో అందరికీ తెలుసు. దాని గురించి వారికి చింత లేదు.

ఇకపోతే మిగిలినదెల్లా అచ్చంపేట ఒక్కటే. దీన్ని చేజిక్కించుకోవడానికి పార్టీ మొత్తం ఫోకస్‌ పెడుతున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు తదితరులకు ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరఫున డికె అరుణ ఇన్చార్జిగా ఉన్నారు. తెదేపా తరఫున రేవంత్‌రెడ్డి తదితరులు కూడా ఈ స్థానం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని అనుకోవచ్చు. అందుకే తెరాస ఇక్కడ ఎక్స్‌ట్రా ఫోకస్‌ పెడుతోంది. మరి ఫైనల్‌ రిజల్ట్‌ వచ్చేసరికి తెరాస అచ్చంపేట కూడా గెలిచి.. నాలుగు సీట్లను క్లీన్‌ స్వీప్‌ చేస్తుందా, లేదా 3-1 తేడా స్కోరుతో తమ హవాను నిరూపించుకుంటుందా? అనేది వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close