చేపలమ్ముకునేవాళ్లపై విజిలెన్స్ – ఫిష్ మార్టుల కోసమా ?

ఏపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం నేరుగా పిష్ ఆంధ్రా పేరుతో మార్టులు పెడుతూంటే పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. దీంతో ఇటీవలి కాలంలో మార్కెట్లలో చేపలమ్ముకునేవాళ్లపై అధికారులు గురి పెట్టారు. వరుసగా దాడులు చేస్తున్నారు. ఆదివారం పూట ఫిష్ మార్టులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కనీసం 150 మందిపై కేసులు పెట్టారు. ఎందుకంటే తూకం సరిగ్గా వేయడం లేదట. చేపల తూకం పక్కగా ఉంటుందని వినియోగదారులు కూడా అనుకోరు. చాలా చోట్ల ఫిష్ ఆకారాన్ని బట్టి రేటు పెట్టుకుంటారు కానీ తూకం వేసుకోరు. ఫిష్ మార్కెట్‌లో బేరసారాలు భిన్నంగా ఉంటాయి. అయినా తూకం సరిగ్గా లేదని చేపలమ్ముకునేవాళ్లపై కేసులు పెట్టేశారు.

ఫిష్ మార్టులు పెట్టి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని చాలా మంది మత్స్యకారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రకరకాల స్కీములతో యువతకు ఉపాధి కల్పిస్తున్నామంటూ ఫిష్ మార్టులను ప్రారంభించింది. అయితే ఎక్కడా అవి క్లిక్ అవలేదు. చివరికి ముఖ్యంగా ఘనంగా ప్రకటించిన పులివెందుల ఫిష్ మార్ట్ కి కూడా కరెంట్ బిల్లులు కూడా రాక మూసేశారు. తర్వాత మీడియాలో వచ్చినా హడావుడిగా తెరిచారు కానీ అక్కడ ఏమీ అమ్మలేదు. మళ్లీ మూతపడిపోయింది. అనేక మందికి పంపిణీ చేసిన ఫిష్ మార్ట్ వాహనాలదీ అదే పరిస్థితి.

ఈ స్కీమ్ దారుణంగా విఫలం కావడంతో చేపల మార్కెట్లలో కార్యకలాపాలు తగ్గిస్తే జనం ఫిష్ మార్టుల వైపు చూస్తారన్న ఆలోచన చేశారేమో కానీ.. ఒక్క సారిగా చేపల మార్కెట్లపై విరుచుకుపడ్డారు. వ్యాపారం అధికంగా జరిగే ఆదివారం రోజున వ్యాపారులను తనిఖీల పేరుతో భయ భ్రాంతులకు గురి చేశారు. ఐదు వందల చేపల దుకాణాల్లో తనిఖీలు చేసి170 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తీరుపై మత్స్యకారులు ఆేదన చెందుతున్నారు. తమ పొట్ట కొట్టవద్దని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close