ఈ వేసవిలో విడుదల అవుతున్న సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. జూన్ లేదా జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ‘విశ్వంభర’పై అంచనాలు పెద్దగా లేవు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు.
సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వడం, టీజర్ ట్రోల్ కి గురి అవ్వడంతో బజ్ పూర్తిగా పడిపోయింది. ట్రైలర్ వచ్చి, అదేమైనా షాకింగ్ గా ఉంటే, అప్పుడు ‘విశ్వంభర’ కు కాస్తో కూస్తో హైప్ వస్తుంది. అందుకే ట్రైలర్ కట్ పై చిత్రబృందం గట్టిగా ఫోకస్ పెట్టింది.
మరోవైపు ‘విశ్వంభర’ వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ అన్నీ మెల్లమెల్లగా నిర్మాతల చేతికి అందుతున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ అంచనాలకు మించి వచ్చినట్టు టాక్. అందులోంచి కొన్నిషాట్స్ తీసి ట్రైలర్ కట్ చేస్తున్నారు. రాబోయే ట్రైలర్ ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇవ్వొచ్చు. ఇక నుంచి ఈ సినిమా గురించి కూడా గట్టిగా మాట్లాడుకొంటారని, ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ‘విశ్వంభర’ అప్ డేట్ ఇద్దామనుకొన్నారు. కానీ ‘పెద్ది’ గ్లింప్స్ వల్ల ఆ ఆలోచన విరమించుకొన్నారు. ఈసారి వచ్చే అప్ డేట్ లో ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఓటీటీ డీల్ కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. వీటిపై కూడా ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ వుంది. ఓటీటీ డీల్ క్లోజ్ అయితే… రిలీజ్ కి దాదాపుగా మార్గం సుగమం అయినట్టే. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. వశిష్ట దర్శకుడు.
