కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే అదానీ షేర్లు కరిగిపోతున్నాయేంటి ?

మూడు రోజుల కిందట సెబీ ..అదానీ గ్రూప్ కు ఓ తీపి కబురు చెప్పింది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నిజాలు ఉన్నాయని చెప్పలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. అదే సమయంలో 2016 నుంచి అదానీ సంస్థలపై విచారణ చేస్తున్నామని వచ్చిన వార్తలను కొట్టి పడేసింది. నిజానికి ఇవి గుడ్ న్యూస్. షేర్ ధరలు పెరగాల్సి ఉంది.కానీ అనూహ్యంగా పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ లో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీలన్నీ నష్టాల్లోనే మునిగిపోయాయి. దీనికి కారణం కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడమేనని చెబుతున్నారు.

ప్రపంచ బిలియనీర్ అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు మరోసారి క్షీణించాయి. మే 15వ తేది సోమవారం అదానీ గ్రూప్ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించాయి. కంపెనీల్లో షేర్ల అమ్మకం​ ద్వారా రూ.21 వేల కోట్లు సేకరించాలని అదానీ గ్రూప్​ మరో సారి నిర్ణయించింది. గ్రూప్‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్‌‌‌‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.12,500 కోట్లు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్ మరో రూ.8,500 కోట్లు సేకరిస్తామని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌లలో తెలిపాయి. అయినప్పటికీ మే 15వ తేది సోమవారం అదానీ గ్రూప్ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించాయి.

అదానీ షేర్లు తగ్గిపోవడానికి కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కారణమని భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో దేశవ్యాప్తంగా బీజేపీ సెంటిమెంట్ దెబ్బతిన్నదన్న అంచనాలు రావడంతో షేర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని భావిస్తున్నారు. అదే కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందన్న అంచనాలు వచ్చినా.. కాంగ్రెస్ వచ్చినా ఇక అదానీ కంపెనీల పతనాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close