అటు తిరిగి… ఇటు తిరిగి.. ఫైన‌ల్ గా బాల‌య్య ద‌గ్గ‌ర‌కు

పూరి కెరీర్ ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. లైగ‌ర్ త‌ర‌వాత సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ స్ప‌ష్ట‌త లేదు. ముందు చిరు, బాల‌య్య పేర్లు వినిపించాయి. ఆ త‌ర‌వాత విశ్వ‌క్ సేన్ అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ రామ్ అంటున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాకి సీక్వెల్ గా `కాక‌` అనే ఓ సినిమా రాబోతోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. మ‌ళ్లీ పూరి సినిమా మొద‌టికి వ‌చ్చింది. ఈసారి బాలయ్య‌తోనే ఫిక్స్ అన్న‌ది తాజా ఖ‌బ‌ర్‌. రామ్ కోసం అనుకొన్న `కాక‌` క‌థ‌ని.. బాల‌య్య కోసం మార్చి తీస్తున్నార‌ని బ‌య‌ట టాక్‌. రామ్ క‌థ‌… బాల‌య్య‌కి ఎలా సెట్ట‌వుతుంది? అనేది అర్థం కాని విష‌యం.

నిజంగానే బాల‌య్య ఈ సినిమా ఓకే చేసినా, ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులు చాలా త‌క్కువ ఉన్నాయి. ఎందుకంటే.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బాల‌య్య బిజీ. ఆ వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌ను సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడు. 2024 ఎన్నిక‌ల‌కు క‌లిసి వచ్చేలా బోయ‌పాటి సినిమా ఉండ‌బోతోంద‌ని టాక్‌. అందుకే ఎట్టిప‌రిస్థితుల్లోనూ బోయ‌పాటి సినిమా మిస్ అవ్వ‌దు. అంటే.. పూరి – బాల‌య్య కాంబో కుద‌రాలంటే.. క‌నీసం యేడాదైనా ఆగాలి. అప్ప‌టికే పూరి సినిమా ఆల‌స్య‌మైంది. పూరి ఎవ‌రి కోస‌మూ ఆగే టైపు కాదు. సో… బాల‌య్య కోసం కూడా పూరి ఆగే ప్ర‌స‌క్తి లేదు. మ‌రి.. పూరి మైండ్ లో ఏముందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close