నాని హీరోయిన్ వెంట‌… కుర్ర హీరోలంతా

టాలీవుడ్‌కి ఓ కొత్త హీరోయిన్ వ‌స్తోందంటే… అందులోనూ క్రేజ్ ఉన్న ప్రాజెక్టులో న‌టిస్తోందంటే అంద‌రి క‌ళ్లూ ఆమెపైనే. ప్రస్తుతం అలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది ప్రియాంకా మోహ‌న్‌. చెన్నై నుంచి వ‌చ్చిన ఈ ముద్దు గుమ్మ ప్ర‌స్తుతం `గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమాలో నాని స‌ర‌స‌న న‌టిస్తోంది. విక్ర‌మ్ కె.కుమార్ ఎంపిక‌పై జ‌నాల‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌. పైగా నాని స‌ర‌స‌న క‌థానాయిక అంటే అంతో ఇంతో మేట‌ర్ ఉండాల్సిందే. అందుకే తొలి సినిమా బ‌య‌ట‌కు రాకుండానే ప్రియాంక ప్ర‌తిభపై న‌మ్మ‌కాలు ఎక్కువైపోయాయి. అందుకే శ‌ర్వానంద్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌కూ కుర్ర‌హీరోలంతా ప్రియాంకా మోహ‌న్ గురించి ఆరా తీయ‌డం మొద‌లెట్టార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్ని ఎంక్వైరీలు కూడా న‌డిచాయి.

కాక‌పోతే…. విక్ర‌మ్ కె.కుమార్ ముందుగానే ఓ లంకె పెట్టేశాడు. `గ్యాంగ్ లీడ‌ర్` విడుద‌లైనంత వ‌ర‌కూ మ‌రో సినిమా చేయ‌కూడ‌ద‌ని కండీష‌న్ పెట్టాడు. దానికి త‌గిన జాగ్ర‌త్త‌లు చాలానే తీసుకున్నాడు. గ్యాంగ్ లీడ‌ర్ ప్రెస్ నోట్ పంపిన‌ప్పుడు కూడా ప్రియాంక పేరు లేకుండా చూసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రియాంక స్టిల్ బ‌య‌ట‌కు రాలేదు. ప్రియాంక ముందు ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా `చేయ‌కూడ‌దు గాక చేయ‌కూడ‌దు` అని విక్ర‌మ్ గ‌ట్టిగా చెబుతున్నాడట‌. అందుకే… ప్రియాంక మ‌రో సినిమా చేయ‌లేక‌పోతోంది. అయితే కుర్ర హీరోల‌కు అంత ఆత్రం ఎందుకో అర్థం కాదు. ఓ హీరోయిన్ ఎంట్రీ అవుతోందంటే – త‌న‌ తొలి సినిమా బ‌య‌ట‌కు రాక‌ముందే క‌ర్చీఫ్‌లు వేసుకోవ‌డానికి రెడీ అయిపోతుంటారు. అప్ప‌ట్లో అనూ ఇమ్మానియేల్ వెంట కూడా ఇలానే పడ్డారు. ఏమైంది? అను వ‌రుస ఫ్లాపులిచ్చి – అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు అను చేతుల్లో సినిమాల్లేవు. మ‌రి ప్రియాంకా మోహ‌న్ ప‌రిస్థితి ఏమ‌వుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close