అంబటి రాంబాబుతో చంద్రబాబును తిట్టించి ఆయనను కాపు నాయకుడికా ప్రొజెక్ట్ చేస్తున్న జగన్ అండ్ కో ప్లాన్ వెనుక అసలు కోణాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూటిగా సుత్తిలేకుండాతన కొత్తపలుకులో బయటపెట్టారు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గెలవలేడు. వారేమో విడిపోవాలని అనుకోవడంలేదు. ఏం చేసినా విడిపోయే అవకాశం లేదు. అందుకే పవన్ కల్యాణ్ ను బలహీనం చేయాలి.. అలా చేయాలంటే.. కమ్మ, కాపుల మధ్య గొడవలు పెట్టాలి. అక్కడే అంబటి రాంబాబును ప్రయోగించారు జగన్. ఈ గొడవలతో కమ్మ,కాపుల మధ్య తేడాలు వస్తే పవన్ కల్యాణ్ కూటమిలో ఉన్నా ఓట్లు చీలిపోతాయని అది తనకు బలమని జగన్ అనుకుంటున్నారు.
అంటే పవన్ కల్యాణ్ నుంచి కాపులను దూరం చేస్తే చాలు తన పని సులువు అవుతుందని జగన్ ఆ పని చేస్తున్నారు.దానికి వైసీపీలో ఉన్న కాపు నేతలంతా సై అంటున్నారు. అంబటి రాంబాబు అడ్డగోలుగా తిట్టడంతో పాటు. ఇతర కాపు నేతలంతా అదే పనిగా జగన్ చెప్పినట్లుగా చేయడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ ను బలహీనం చేయడం అంటే తమను తాము బలహీనం చేసుకోవడం అని కాపులు నమ్మినంత కాలం వీరి డ్రామాలు చెల్లకపోవచ్చు కానీ జగన్ రెడ్డి కుట్రల్ని అంచనా వేయడం సాధ్యం కాదనేది ఆర్కే వాదన.
తన కొత్త పలుకులో జగన్ రెడ్డి నిర్వాకాలను మొత్తం బయటపెట్టారు ఆర్కే. అదే సమయంలో బీఆర్ఎస్, వైసీపీ కలసికట్టుగా చేస్తున్న నాటకాలను కూడా బయటపెట్టారు. రాయలసీమ ఎత్తిపోతలపై సజ్జల నేతృత్వంలో సభ పెడితే.. బీఆర్ఎస్ కిక్కురుమనలేదు. ఆ మీడియాలో చెప్పలేదు. కానీ అదే టీడీపీ నేతలెవరైనా అలాంటివి చేసి ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎగబడేది. నమస్తే తెలంగాణ పేపర్ మొత్తం నిండిపోయేది. కానీ చేసింది వైసీపీ కాబట్టి సైలెంటుగా ఉంటారన్నాట. అంటే వైసీపీ తెలంగాణకు ద్రోహం చేయవచ్చని బీఆర్ఎస్ చెబుతోందన్నమాట అని.. ఆర్కే తేల్చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు.. ప్రజలను ఆకట్టుకోవడం అంటే కులాలు , ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమేనని అనుకుంటున్నారు. అదే వ్యూహాలను పాటిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తతతో వ్యవహరిచాలని ఆర్కే సలహాలిస్తున్నారు.



