వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్‌కు వరంగా కాకుండా శాపంగా మారాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు, ఎంచుకున్న అంశాలు పార్టీని మరింత డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. ఆయన మైక్ పట్టుకుంటే ప్రత్యర్థులపై విమర్శలు చేయడం పక్కన పెడితే, సొంత పార్టీ పరువును వీధిన పడేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంటల తరబడి గణాంకాలు, గ్రాఫ్లతో సాగే ఆయన ప్రసంగాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోగా, అనాలోచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్‌గా మారుతున్నాయి. ఇది చూసి వైసీపీ క్యాడర్ అంతా తల పట్టుకుంటోంది.
మావిగన్ నుంచి మంచోడ్ననే సర్టిఫికెట్ వరకూ
గత కొన్ని ప్రెస్ మీట్లను పరిశీలిస్తే, జగన్ అసంబద్ధ వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అమరావతి రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. మూడు రాజధానుల అంశం అట్టర్ ప్లాప్ అయిన తర్వాత కూడా మావిగన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయనే స్వయంగా ఎస్టాబ్లిష్ చేసినట్లయింది. ఆయన ఏ అంశంపై మాట్లాడినా అది ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి బదులు, తమ పార్టీ చేతకానితనాన్ని ప్రజలకు గుర్తు చేసేలా ఉండటం గమనార్హం. మావిగన్ ట్రోలింగ్ దెబ్బకు ఆయన పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు కుటుంబ చరిత్రనంతా వెలికి తీసేలా చేశారు.
చెట్టు కొట్టి మీద వేసుకునేలా ప్రెస్‌మీట్
జగన్ ప్రసంగాలు , ఆయన వాడే వింత వింత పదజాలం నెటిజన్లకు పెద్ద వినోదంగా మారాయి. సీరియస్ రాజకీయ అంశాల మీద మాట్లాడాల్సిన సమయంలో, వ్యక్తిగత కక్షలు, పాత కథలను పదే పదే వల్లెవేయడం వల్ల ఆయనలో రాజకీయ పరిణతి లోపించిందనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సింది పోయి, పాత రికార్డును ప్లే చేయడం వల్ల ఆయన చరిత్ర అంతా బయటకు వచ్చేందుకు కారణం అవుతున్నారు. ఒక్కసారి కాదు ప్రతీ సారి అదే జరుగుతోంది.
వైసీపీ సోషల్ మీడియా బాధ అంతా ఇంతాకాదు
అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, జగన్ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా వింగ్ , క్యాడర్ ఆ వ్యాఖ్యలను కవర్ చేసుకోవడానికే తంటాలు పడాల్సి వస్తోంది. ఆయన నోటి నుండి జారిన అనాలోచిత మాటలను సమర్థించుకోలేక, అవి ట్రోల్ అవుతుంటే వాటిని ఆపలేక కార్యకర్తలు నరకం చూస్తున్నారు. రాజకీయాల్లో ఓటమి సహజం, కానీ ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకోకుండా.. చేస్తున్న రాజకీయాలు వైసీపీ క్యాడర్‌కే విరక్తి పుట్టిస్తున్నాయి.
