జగన్ రెడ్డిని ట్రోల్ చేయాల్సిన పని టీడీపీ క్యాడర్ ది. కానీ అసలు ఎవరు ట్రోల్ చేస్తున్నారు?. వైసీపీ వాళ్లే ట్రోల్ చేస్తున్నారు. సాక్షి మీడియా నుంచి పార్టీ కార్యకర్తల వరకూ అందరూ జగన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ ట్రోలింగ్ స్టఫ్‌ను.. టీడీపీ సోషల్ మీడియా అందుకోకుండా ఉంటుందా?. సీఎంగా లేకపోయినా తుఫానులో ఎవరూ చనిపోకుండా చేసిన ఒక్క మగాడు మా జగనన్న అని సాక్షి అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించిన చిన్న మాటతో జగన్ రెడ్డికి జరిగిన డ్యామేజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అది ఎంత కామెడీ అయిందో తెలుసుకుని తర్వాత డిలీట్ చేయించారు. కానీ అలా తీసేస్తే అన్ని చోట్లా పోదుగా.. జరగాల్సింది జరుగుతుంది.
జగన్‌ను ట్రోల్ చేస్తోంది సొంత పార్టీ సోషల్ మీడియాస్
జగన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నామన్న కనీస అవగాహన కూడా ఈ పోస్టులు పెట్టే వారికి ఉండటం లేదంటే.. ఎలాంటి మ్యాన్ పవర్ ను వారు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సోషల్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ దానికి క్రెడిట్ ఇవ్వడం కోసం నవ్వుల పాలు చేస్తున్నారు. జగన్ రెడ్డి కి ప్రజల్లో ఉన్న ఇమేజ్ గురించి తెలుసుకుని పోస్టులు పెట్టాలి కానీ.. ఆయనను అతిగా భజన చేస్తూ ట్రోలింగ్ తరహాలో పోస్టులు పెడుతూంటే.. మిగిలిన వారు కూడా నవ్వుకోకుండా ఉంటారా?.
ఇతర పార్టీల కార్యకర్తలకు పని లేకుండా చేస్తున్న వైనం
జగన్ రెడ్డి సోషల్ మీడియా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాను.. టీడీపీపై .. ఆ పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననం చేయడానికి పెట్టుకున్నారు కానీ వారు చేస్తోంది మాత్రం జగన్ వ్యక్తిత్వ హననం. ఆయన ఎంత సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా ఏదో క్రెడిట్ ఇవ్వాలని తాపత్రయ పడుతూ అతిగా పోస్టులు పెడుతూ నవ్వుల పాలయ్యారు. అంటే డబ్బులిచ్చి మరీ జగన్ రెడ్డి తనను తాను ట్రోల్ చేయించుకుంటున్నారు. దీని వల్ల ఆయనకు ఏం లాభం వస్తుందో ఆయనకే తెలియాలి.
ఆల్రెడీ జోకర్ అయిపోయారు.. ఇంకెప్పుడు తెలుసుకుంటారు !?
కానీ జగన్ రెడ్డి మాత్రం రోజు రోజుకు ఓ కామెడీ పీస్ గా మారుతున్నారు. ఆయనను సీరియస్ గా తీసుకునేవారు దాదాపుగా లేరు. ఆయన ఫ్యాన్స్ కూడా రియలైజ్ అయ్యారు. అందుకే ట్రోల్ చేస్తున్నామని తెలిసి కూడా కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు నారాలోకేశ్ వ్యక్తిత్వాన్ని కించ పరచడానికి వందల మంది సోషల్ మీడియా సైనికుల్ని పెట్టి యుద్ధమే చేశారు. ఇప్పుడు ఆయన పెట్టుకున్న సైన్యమే ఆయనను పప్పుగా మారుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. జగన్ రెడ్డి తెలుసుకోలేకపోవడం. అదేనేమో.. నువ్ ఏది ఇస్తే అదే అదే తిరిగి రావడం.
