సిరి వెన్నెల‌కు ప‌ద్మ‌శ్రీ‌

తెలుగు సినిమా పాట‌ల రారాజు, సాహితీ చ‌క్ర‌వ‌ర్తి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ప‌ద్మశ్రీ పుర‌స్కారం వ‌రించింది.  రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తియేటా.. ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించే సంగ‌తి తెలిసిందే. తెలుగు నుంచి.. ప‌ద్మ‌శ్రీ జాబితాలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి కి చోటు ద‌క్కింది. `సిరివెన్నెల‌`తో పాట‌ల ప్ర‌స్థానం ఆరంభించారు సీతారామ‌శాస్త్రి. అప్ప‌టి నుంచీ ఆయ‌న పేరు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అయిపోయింది. ఎన్నో చిత్రాల‌కు త‌న‌దైన శైలిలో పాట‌ల్ని అందించి.. నంది అవార్డులు సొంతం చేసుకున్న  సీతారామ‌శాస్త్రికి మ‌రెన్నోసార్లు జాతీయ పుర‌స్కారాలు తృటిలో త‌ప్పిపోయాయి. దాంతో ఆయ‌న‌చాలాసార్లు మీడియా ముందే త‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కేవారు.  `జాతీయ అవార్డుల ఎంపిక‌కు కొల‌మానం ఏమిటి?` అని నేరుగా ప్ర‌శ్నించిన సంద‌ర్భాలున్నాయి. ఎట్ట‌కేల‌కు ఆయ‌న ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ద‌క్కిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close