TRS Pragathi Nivedana Sabha Live Updates

0

Pragathi Nivedana Sabha

Pragathi Nivedana Sabha (Progress report meeting) , TRS’s show of strength before 2019 general elections is scheduled for today. It has been aimed at making 25 lakh people to attend the meeting. Political observers as well as political parties are curiously watching this meeting. TRS cadre is making all efforts to make this a grand success. Telugu360 is providing live updates from the venue Kongara Kalan, Hyderabad and across Telangana :

ఊరించి ఊరించి.. గాలి తీసేసిన‌ కేసీఆర్‌!

ప్ర‌గ‌తి నివేదన స‌భ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి! ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న ఇదే స‌భా వేదిక‌గా చేస్తార‌నీ, అసెంబ్లీ ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసి, ఎన్నిక‌లకు సై అంటార‌ని తెరాస నేత‌లు మొద‌లుకొని సామాన్యుల వ‌ర‌కూ అంద‌రూ ఎదురుచూశారు. కానీ, ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో దాని గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నే చెయ్య‌లేదు. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌నీ, ఆరోజున అన్నీ ప్ర‌జ‌ల‌కు తాను స్వ‌యంగా వివ‌రిస్తాన‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

నిజానికి, స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచీ… టీవీల ముందూ, ఇంటర్నెట్ ద్వారా కేసీఆర్ ప్ర‌సంగం చూస్తున్న‌వారంతా ఆ ఒక్క ప్ర‌క‌ట‌న కోస‌మే ఎదురుచూశారు. మిగతా అభివ్రుద్ధి నివేదన అంతా ప్రజలకు తెలియంది కాదు కదా. తెలంగాణ ఉద్య‌మం ప్రారంభం పరిస్థితుల నుంచీ ఆయ‌న ప్ర‌సంగం మొద‌లుపెట్టారు. స‌మైక్య రాష్ట్రంలో న‌ష్ట‌పోయామ‌నీ, ప‌రోక్షంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో చాలా న‌ష్టాలూ క‌ష్టాలు ఎదుర్కొన్న‌ట్టు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో… ఒక సెంటిమెంట్ ర‌గిల్చే దిశ‌గా కేసీఆర్ ప్ర‌సంగం మొద‌లైంద‌ని అనిపించింది. ఆ త‌రువాత‌, రాష్ట్ర సాధ‌న‌, కొత్త రాష్ట్రంలో ఒక్కోటిగా ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను చెప్పారు. ఆ త‌రువాత‌, ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి ప్ర‌జ‌ల క‌ళ్ల ముందే ఉంద‌న్నారు. మ‌రోసారి కేసీఆర్ నాయ‌క‌త్వం కావాల‌నీ, తెరాస పాల‌న రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌నీ అన్నారు. ఈ దశలో ముందస్తు ప్రకటనకే తన ప్రసంగాన్ని డ్రైవ్ చేస్తున్నారని అనిపించింది. ఇంకేముంది, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌రువాత చెప్ప‌బోతున్న అంశం అసెంబ్లీ ర‌ద్దు అయి ఉంటుంద‌నే అంచ‌నాలు పెరిగాయి.

కానీ, స‌రిగ్గా ఆ అంశానికి వ‌చ్చేస‌రికి… ఈ మ‌ధ్య పేప‌ర్లు రాస్తున్నాయీ, టీవీల్లో వేస్తున్నారంటూ… అలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే త్వ‌ర‌లో చెప్తామ‌ని తుస్ మ‌నిపించారు. సో… అసెంబ్లీ ర‌ద్దు ఇప్పుడు లేదు. అలాగ‌ని, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉండే అవ‌కాశాలు లేవ‌నీ కేసీఆర్ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. మేనిఫెస్టో త‌యారౌతుంద‌నీ, ముఖ్య‌మంత్రి హోదాలో అన్నీ చెప్ప‌లేన‌ని కేసీఆర్ అన‌డ‌మూ గ‌మనార్హ‌మే. అంటే, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెరాస వెళ్తుందా…? అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం త్వ‌ర‌లో ఉంటుందా… అంటే, ఉండే అవ‌కాశాలున్న‌ట్టుగానే సంకేతాలు ఇచ్చారు. ఈ ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు ముందు కూడా ఇలాంటి ఒక ఉత్కంఠ వాతావ‌ర‌ణాన్నే సృష్టించారు. స‌భ జ‌రిగే చివ‌రి నిమిషం వ‌ర‌కూ క‌నీసం తెరాస‌కు చెందిన ఏ స్థాయి నేత‌కు కూడా స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా ఊరించారు! ఆఖరికి, ఇలా… ఇంకా స‌మ‌యం ఉంద‌నీ, త్వ‌ర‌లో విడుద‌ల అంటూ కేసీఆర్ తేల్చేశారు.

19:45 AMఢిల్లీకి గులాం చేసే చెంచాగిరీ కావాలా : కేసీఆర్

కేసీఆర్ ను గ‌ద్దె దించ‌డ‌మే త‌మ లక్ష్య‌మ‌ని కొంత‌మంది మాట్లాడుతున్నార‌నీ, ఇదేమి దిక్కుమాలిన ల‌క్ష్య‌మ‌న్నారు సీఎం. తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తామో చెప్పాలిగానీ, ఇలా మాట్లాడ‌టం ఏంట‌ని ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీల వారు ప్ర‌తీదానికీ ఢిల్లీపైనే ఆధార‌ప‌డ‌తార‌నీ, అలాంటి వారికి గులాం చేసే చెంచాగిరీ నాయ‌క‌త్వం తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా, తెలంగాణ నిర్ణ‌యాలు తెలంగాణ‌లోనే తీసుకునే సామ‌ర్థ్య‌మున్న పాల‌న కావాలో అంద‌రూ ఆలోచించాల‌న్నారు. ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడు మాదిరిగా ఇత‌ర పార్టీల‌ను రానీయ‌కుండా మ‌నం ప‌రిపాలించుకోవాల‌న్నారు. ఢిల్లీకి మ‌నం బానిస‌లు కావొద్ద‌న్నారు.

19:34 AMరాబోయే రోజుల్లో కీల‌క రాజ‌కీయ నిర్ణ‌యం : కేసీఆర్

ఈ మ‌ధ్య పేప‌ర్ల‌లో, టీవీల్లో.. కేసీఆర్ శాస‌న స‌భ ర‌ద్దు గురించి స‌భ‌లో ఏమైనా చెప్తారా అని చూశాయ‌న్నారు. ‘రాజ‌కీయంగా తెలంగాణకి, తెరాస‌కి, ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తుకు ఏది మంచి నిర్ణ‌య‌మైతే దాన్ని తీసుకోండ‌ని మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు అంద‌రూ నాకు అప్ప‌గించారు. రాబోయే రోజుల్లో మీరు చూడ‌బోతారు.. ఆ నిర్ణ‌యాల‌న్నీ తీసుకుంటాం, తీసుకున్న రోజున విష‌యాల‌న్నీ చెప్తాను’ అన్నారు.

19:34 AMమ‌ళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు: కేసీఆర్

త‌మ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి గురించి తాము ప్ర‌త్యేకంగా ఇవాళ్ల చెప్పాల్సిన ప‌నిలేద‌నీ, అన్నీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందే ఉన్నాయ‌ని కేసీఆర్ అన్నారు. త‌వ్విన కాక‌తీయ చెరువులు, కాలిపోకున్నా ఉన్న మోటార్లు, క్వాలిటీ విద్యుత్ ఇళ్ల‌కు వ‌స్తోంది, కృష్ణా గోదావ‌రి నీళ్లు మీ ఇండ్ల‌కే వ‌స్తున్నాయి, కాలువ‌లు, ప్రాజ‌క్టుల నిర్మాణాలు అన్నీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందే ఉన్నాయ‌న్నారు. అందుకే, ప్ర‌జ‌లు మ‌ళ్లా కేసీఆర్ కావాలి, తెరాస రావాల‌ని అంటున్నార‌ని చెప్పారు. ఇది ప్ర‌జావాణి అన్నారు.

19:22 AMతెరాస ప్ర‌భుత్వం ఉన్నంత‌కాలం రైతుబంధు : కేసీఆర్

తెలంగాణ రైతులను ఆదుకోవ‌డం కోస‌మే రైతుబంధు కార్య‌క్ర‌మం ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. తెలంగాణ‌లో అప్పులు లేని రైతులు లేర‌నీ, అందుకే పెట్టుబ‌డి ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే రైతు బంధు తెచ్చామ‌న్నారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వ‌చ్చి, వ‌రుస‌గా ఓ నాలుగైదు సంవ‌త్స‌రాలు పంట‌లు పండితే… అప్పుడు రైతులు బాగుప‌డ‌తార‌న్నారు. ఎవ్వ‌రూ ధైర్యం చెయ్య‌ని విధంగా భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. తెరాస ప్ర‌భుత్వం ఉన్నంత‌కాలం రైతు బంధు కొన‌సాగుతుంది, రైతులు ధ‌న‌వంతుల‌య్యే వ‌ర‌కూ ఇది ఉంటుంద‌న్నారు.

19:22 AMకోటి ఎక‌రాల్లో నీళ్లు చూపిస్తా : కేసీఆర్

తెలంగాణ శాశ్వ‌తంగా ధ‌నిక రాష్ట్రంగా ఉండాలంటే దీర్ఘ‌కాలిక ప‌థ‌కాల‌ను కూడా అమ‌లు చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. దాన్లో భాగంగా కోటి ఎక‌రాల‌కు నీరు తెస్తాన‌ని కేసీఆర్ మాట్టిచ్చాడ‌నీ, మాట త‌ప్ప‌డ‌ని చెప్పారు. కొన్ని పనులు 80 శాతం వ‌ర‌కూ అయిపోయాయ‌నీ, కొన్ని స‌గ‌మైనాయ‌నీ, పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం, కాళేశ్వ‌రం ప్రాజెక్టు, దేవాదుల.. ఇలా అన్నీ పూర్తి చేస్తామ‌న్నారు. రాబోయే రెండేళ్ల‌లో కోటి ఎక‌రాల్లో నీళ్లు చూపిస్తా, ఆకుప‌చ్చ తెలంగాణ చూపిస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

19:19 AMక‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం అలా వ‌చ్చింది : కేసీఆర్

ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు వ‌రంగ‌ల్ జిల్లా ములుగు ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు, ఒక లంబాడా తండా కాలిపోయింద‌న్నారు. అక్క‌డో వ్య‌క్తి ఏడుస్తుంటే ఓదార్చితే… త‌న కుమార్తెకు పెళ్లి చేద్దామ‌ని రూ. 50 వేలు ఇంట్లో పెడితే కాలిపోయాయ‌ని బాధ‌ప‌డ్డాడు. తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ల‌బోదిబోమ‌న్నాడ‌ని చెప్పారు. త‌న‌ను హ‌త్తుకుని, ఆయ‌న బిడ్డ పెళ్లికి రూ. 1 ల‌క్ష పంపించి, పెళ్లికి వెళ్లాన‌న్నారు. పేద‌ల ఇళ్ల‌లో ఇలా పెళ్లిళ్లు జ‌ర‌గ‌ని హృద‌య విదార‌క దృశ్యాలు చాలా చూశామ‌నీ, ఆ బాధ‌ల్లోంచి పుట్టిన ఆలోచనే నేటి క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం అని సీఎం చెప్పారు.

19:13 AMగొర్రెలు పెంచ‌డ‌మూ గొప్పే : కేసీఆర్

తెలంగాణ వ‌చ్చాక కుల‌వృత్తుల‌ను కాపాడుకున్నామ‌న్నారు సీఎం కేసీఆర్‌. న‌యా పారిశ్రామిక వేత్త‌లు చెబుతున్న‌ట్టు పారిశ్రామిక అభివృద్ధి మాత్ర‌మే వృద్ధి కాద‌నీ… ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మాత్రమే అంటార‌న్నారు. కంప్యూట‌ర్లు, హార్డ్ వేర్లు మాత్ర‌మే కాదు… గొర్రెలు పెంచ‌డ‌మూ, బ‌ర్రెలు పెంచ‌డ‌మూ పెద్ద వృత్తులే అన్నారు. ఇలా ఎన్నోక‌ష్టాల‌ను ద‌గ్గ‌ర్నుంచీ చూశాన‌న్నారు.

19:10 AMఆరోజు నేను కుమిలి ఏడ్చేశాను: కేసీఆర్

స‌మైక్య పాల‌కుల ఏలుబ‌డిలో జ‌రిగిన విధ్వంసం అంతాఇంతా కాద‌న్నారు సీఎం. ఓరోజు రాత్రిపూట క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న చేసి, హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణంలో వ‌స్తూ సిరిసిల్ల‌లో ఆగాన‌న్నారు. ఆరోజున‌, అక్క‌డ జిల్లా క‌లెక్ట‌ర్ గా ఉన్న వ్య‌క్తి… చ‌చ్చిపోకండీ, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోకండీ అని గోడ‌లు మీద రాస్తే… అది చూసి కుమిలి కుమిలి ఏడ్చాన‌న్నారు. చావులు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాద‌ని గోడ‌ల మీద చూడాల్సిన దుస్థితి వ‌చ్చింద‌న్నారు. భూదాన్ పోచంప‌ల్లిలో ఒకే రోజున ఏడుగురు కుల వృత్తుల‌వారు విషం తాగి చనిపోయార‌నీ, ఆనాటి ముఖ్య‌మంత్రిని రూ. 50 వేలు ప‌రిహారం ఇమ్మ‌ని తాను కోరితే ఇవ్వ‌లేద‌న్నారు. వీధుల్లో జోలెప‌ట్టి తిరిగి తామే డ‌బ్బులిచ్చామ‌న్నారు. రాష్ట్రం వ‌స్తే కాపాడుకుంటామ‌ని ఆనాడే మాట‌చ్చాన‌న్నారు.

19:02 AMజ‌య‌శంక‌ర్ ఆలోచ‌నే మిష‌న్ కాక‌తీయ‌

జ‌య‌శంక‌ర్ తో ఓసారి తాను ఢిల్లీలో క‌లిశాన‌నీ, ఇంజినీరు స్వ‌ర్గీయ విద్యాసాగ‌ర‌రావుతో క‌లిసి చాలా మాట్లాడుకున్నామన్నారు కేసీఆర్. దేవుడు ద‌య త‌లిస్తే తెలంగాణ వ‌స్తుంద‌నీ, రాగానే ఏం చెయ్యాల‌ని చ‌ర్చ‌చేశామ‌ని కేసీఆర్ చెప్పారు. అప్ప‌టికే రాత్రి 1 గంట అవుతుంటే… రాష్ట్రం వ‌చ్చాక ఆలోచిద్దామ‌ని విద్యాసాగ‌ర‌రావు అన్నార‌ని చెప్పారు. ఆ త‌రువాత‌, తానూ జ‌య‌శంక‌ర్ చాలాసేపు మాట్లాడుకున్నామ‌నీ… చాలా విష‌యాలు రాసుకున్నామ‌న్నారు. ఆనాడు తాము రాసుకున్న అంశాల్లో కీల‌క‌మైంది… రాష్ట్రంలో భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటాయనీ, చెరువుల్లో నీటి సామ‌ర్థ్యం పోయింది, తెలంగాణ రాగానే త‌క్ష‌ణం చెరువులు బాగు చెయ్యాల‌నుకున్నాం. ఈరోజు అమ‌లు చేస్తున్న మిష‌న్ కాక‌తీయ 2006లో జ‌య‌శంక‌ర్ ఆలోచ‌న నుంచి ఇది పుట్టింద‌న్నారు.

18:53 AM పిడికెడు మందితో తీసుకున్న ప్ర‌తిజ్ఞ‌

2001, ఏప్రిల్ 25 నాడు జ‌ల‌దృశ్యంలో తాను ఒక ప్ర‌తిజ్ఙ తీసుకున్నాన‌నీ, పిడికెండు మందితో ఉద్య‌మం మొద‌లుపెట్టాన‌న్నారు కేసీఆర్‌. ప్రాణం పోయినా మ‌డ‌మ తిప్ప‌ను, ఎత్తిన జెండా దింప‌ను, దింపితే రాళ్ల‌తో తిప్పి కొట్టండ‌ని తెలంగాణ స‌మాజానికి చెప్పాన‌న్నారు. నా మాట న‌మ్మిన విద్యార్థులు, మ‌హిళ‌లు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌దిలి వ‌చ్చార‌న్నారు. ఆ త‌రువాత‌, అనేక ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. 36 పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి, 14 సంవ‌త్స‌రాల శ్ర‌మ త‌రువాత తెలంగాణ సాధించుకున్నామ‌న్నారు.

18:47 AM స‌మైక్య వాదుల‌ది అహంకారం – కేసీఆర్‌

స‌భ‌ను చూస్తుంటే… కొన్ని గుర్తొస్తున్నాయ‌న్నాంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉప‌న్యాసం ప్రారంభించారు. 2000 సంవ‌త్స‌రం.. ఆనాటి ముఖ్య‌మంత్రి ఎడాపెడా క‌రెంటు ఛార్జీలు పెంచితే దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో తెలంగాణ రైతాంగం ఉన్నార‌న్నారు. ఆరోజున ఒక లేఖ ద్వారా సీఎంను తాను ఒక‌టి నివేద‌న చేశాన‌నీ… ఈ ఛార్జీలు త‌గ్గించ‌క‌పోతే వెన‌క‌బ‌డిన తెలంగాణ బిడ్డ‌లు త‌ట్టుకోలేర‌నీ, స‌మైక్య రాష్ట్రంలో స‌మ‌స్య‌లు తీర‌వ‌నీ, సొంత రాష్ట్రం కోసం ఉద్య‌మిస్తామ‌ని చెప్పాన‌న్నారు. ఆనాటి స‌మైక్య వాదులు అహంకారంతో ఉన్నార‌న్నారు. ఆ కరెంటుఛార్జీల పెంపుతోనే ఉద్యమానికి బీజం పడిందన్నారు.

18:39 AMమ‌రో ప‌దేళ్లు కేసీఆర్ నాయ‌క‌త్వం అవ‌సరం!

మ‌రో ఐదేళ్ల‌పాటు ఈ ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించుకుంటే.. మ‌న బంగారు తెలంగాణ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని తెరాస నేత కే కేశ‌వ‌రావు అన్నారు. మ‌రో ప‌దేళ్ల‌పాటు తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఉంటే… ఈ స్వ‌ర్ణ తెలంగాణ‌, నిజ‌మైన స్వ‌ర్గ తెలంగాణ అవుతుంద‌నీ, ఆ నమ్మకం తనకు ఉందని కేకే అన్నారు.

18:24 AM కొంగరకలాన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. కాసేపట్లో ప్రారంభం కానున్న ప్రగతి నివేదన సభ.

17:44 AM ప్రగతి నివేదన సభ కోసం కొంగర కలాన్ బయలు దేరిన కేసీఆర్

17:12 AM ప్రగతి భవన్ నుంచి ఇంకా బయలుదేరని కేసీఆర్.. ‍ ! సభా ప్రాంగణంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్కక్రమాలు

16:40 AMగంట‌న్న‌ర‌పాటు ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం

ప్ర‌గ‌తి నివేద‌న స‌భా ప్రాంగ‌ణానికి తెలంగాణ మంత్రులు హెలీ కాప్ట‌ర్ ద్వారా చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాయంత్రం 5: 30 కి బ‌య‌లుదేరుతారు. దాదాపు గంట‌న్న‌ర‌పాటు ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌సంగం ఉంటుంద‌ని తెలుస్తోంది.

ట్రాక్ట‌ర్ల‌కు ఈరోజు తిరుగు ప్ర‌యాణం లేదు : డీజీపీ

కొంగ‌ర కాల‌న్ లో జరుగుతున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు తెలంగాణ న‌లువైపుల నుంచి ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందీలేద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు. అయితే, ట్రాక్ట‌ర్ల‌లో త‌ర‌లి వ‌స్తున్న‌వారికి ఇవాళ్ల తిరుగు ప్ర‌యాణం ఉండ‌ద‌న్నారు! తిరుగు ప్ర‌యాణంలో ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ట్రాక్ట‌ర్ల‌ను రేపు ఉదయం త‌రువాతే వెళ్లాల‌ని సూచించారు. దీంతో ఈ రాత్రంతా వాళ్ల ప‌రిస్థితి ఏంట‌నేది ఇంకా తెలియాల్సి ఉంది.

15:45 AM ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో రెండు, మూడు లక్షలలోపు జనం, కేసీఆర్ రాక ఆలస్యం అయ్యే అవకాశం

KTR Monitoring the Arrangements

15:20 AM సీఎం కేసీఆర్‌ నివాసంలో మంత్రులకు విందు, నాలుగు తర్వాత సభా ప్రాంగణానికి కేసీఆర్

14:35 AM తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే:

తెలంగాణ కీలక కేబినెట్ సమావేశం ముగిసింది. నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తానని ముందుగా ప్రచారం జరిగినా, సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా ముందుకు వచ్చి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే:

  • బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కోసం 71 కరాల భూమి, 68 కోట్ల నిధులు
  • గోపాల మిత్రులకు వేతనం 8500 కి పెంపు. గతంలో వీరి జీవితం 3500/-.
  • కాంట్రాక్ట్ డాక్టర్ల ఎకరం నలభై వేలకు పెంపు
  • అర్చకుల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలకి పెంపు. గతంలో 58 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు.
  • రెడ్డి హాస్టల్ కొరకు గతంలో కేటాయించిన పది ఎకరాల కు తోడుగా మరొక ఐదు ఎకరాల స్థలం కేటాయింపు.
  • ఆశ వర్కర్ల వేతనం 6000 నుంచి 7,500 కి పెంపు.
  • సెకండ్ ఏ ఎన్ ఎం ఎలా వేతనాలు 11 వేల నుంచి 21 వేలకు పెంపు
  • స్టాఫ్ నర్సులు జీతాలు పెంపు

అయితే ఇవన్నీ విధాన పరమైన నిర్ణయాలు తప్ప, మరీ సంచలనాత్మక నిర్ణయాలయితే కాదు. మంత్రుల సమావేశం చివరలో వెళుతూ వెళుతూ కడియం శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందాకటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని, ఇవి మాత్రమే కాకుండా మరెన్నో నిర్ణయాలు త్వరలో వెలువడతాయని సస్పెన్స్ కొనసాగిస్తూ సమావేశాన్ని ముగించారు.

అయితే ఈ కేబినెట్ నిర్ణయాలు మాత్రమే కాకుండా, మరి నా వరాల జల్లులు సీఎం కేసీఆర్ నేరుగా సభలోని ప్రకటిస్తారన్న ఆసక్తి కూడా నెలకొంది

14:00 AM ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

13:25 AM

  • ముందస్తు ఎన్నికలకు మేం సిద్ధం, కార్యకర్తల్ని కేసీఆర్ సన్నద్ధం చేస్తున్నారు: కేటీఆర్
  • నిన్న రాత్రికే నాలుగు లక్షల మంది సభా ప్రాంగణానికి చేరుకున్నారు, ప్రజలందరూ స్వచ్చందంగా వస్తున్నారు: కేటీఆర్
  • సభ, కేబినెట్ భేటీ ఒకేసారి పెట్టడం కేసీఆర్ సమర్థతకు నిదర్శనంం : కేటీఆర్

13:21 AMప్రారంభమైన తెలంగాణ కేబినెట్…! ఉద్యోగులతో సహా అన్ని వర్గాలనూ ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

12:41 AMప్రగతి భవన్‌కు చేరుకుంటున్న మంత్రులు. ఒంటిగంటకు కేబినెట్ భేటీ. కేటీఆర్, మహేందర్ రెడ్డిలకు మాత్రం కేబినెట్ భేటీ నుంచి మినహాయింపు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కలిసి సభా ప్రాంగణానికి కేసీఆర్.

11:59 AMఇప్పటి వరకు గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరని కెసిఆర్ : రాజభవన్ వర్గాలు

11:50 AMకొంగరకలాన్ సభ నేపధ్యంలో.. జాగ్రత్తగా ఉండాలని హైదారాబాద్‌లోని తమ దేశ పౌరులకు అమెరికా కాన్సులేట్‌ సూచనలు జారీ చేసింది. వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టాలని హెచ్చరించింది.

11:34 AMకొంగరకలాన్ వద్ద జనసందోహం. ఇప్పటికే లక్షన్నర మందికిపై రాక. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి వస్తున్న వాహనాలు.

11:13 AM

  • ఉదయం నుంచే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు
  • దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికీ భోజన వసతి కల్పించిన నిర్వాహకులు
  • ఇప్పటికే చేరుకున్న 3000 ట్రాక్టర్లు
  • లంబాడీల నృత్య ప్రదర్శన

11:00 AM
టీఎస్ఆర్టీసికి చెందిన 90 శాతం బస్సులు కొంగరకలాన్‌కే. స్కూలు, కాలేజీ బస్సుల్లోనూ కార్యకర్తల తరలింపు.

నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ కసరత్తు. లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్..?

10:07 AMమంత్రులు ktr, మహేందర్ రెడ్డి లకు క్యాబినెట్ సమావేశం నుంచి మినహాయింపు…
సభ స్థలంలోనే ఉండాలని సీఎం కెసిఆర్ ఆదేశం…
సభ నిర్వహణ ఇంచార్జిలుగా ఉన్న ఈ ఇద్దరు మంత్రులు…

10:00 AM మంచిర్యాల జిల్లా – మంచిర్యాల నియోజకవర్గం నుండి ప్రగతి నివేదన సభకు బయలుదేరిన140 బస్సులు,100 ఇతర వాహనాలు,జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావ్,

చెన్నూర్ నియోజకవర్గం నుండి ప్రగతి నివేదన సభకు బయలుదేరిన 150 బస్సులు,250 ఇతర వాహనాలు,జెండా ఊపి ప్రారంభించిన విప్ ,ఎమ్మెల్యే ఓదేలు,

బెల్లంపల్లి నియోజకవర్గo నుండి ప్రగతి నివేధన సభకు బయలుదేరిన150 బస్సులు,100 ఇతర వాహనాలు, జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,

శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణ పూర్ కోల్ బెల్ట్ ప్రాంతాల నుండి సభకు బయలుదేరిన సింగరేణి కార్మికులు…

తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్ లో నిర్వహిస్తున్న ” ప్రగతి నివేదన సభ” … రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అత్యంత భారీగా నిర్వహిస్తున్న సభగానే కాదు… కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగూండటమే దీనికి కారణం.

కొంగరకలాన్ సభా ప్రాంగణానికి ఉదయం నుంచే టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం ప్రారంభించారు. చాలా జిల్లాల నుంచి ట్రాక్టర్ల ర్యాలీలు శనివారమే ప్రారంభమయ్యాయి. వారంతా… మెల్లగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

నిన్న రాత్రి హఠాత్తుగా పడిన వర్షంతో… సభ నిర్వాహకులు కాస్తంత కంగారు పడ్డారు. భారీ కటౌట్ పడిపోవడం… ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారింది. మళ్లీ వర్షం పడితే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జన సమీకరణ విషయంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు… పక్కా సూచనలు చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని తీసుకురావాలో ముందుగానే నిర్దేశించారు. పాతిక లక్షల మంది టార్గెట్ ను రీచ్ అవుతామని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

లక్ష వాహనాల పార్కింగ్‌కు … సభా ప్రాంగణం చుట్టూ ప్రత్యేకంగా ప్రదేశాలు నిర్దేశించింది. నేతల రాక కోసం.. ప్రత్యేకంగా రూట్‌ను సిద్ధం చేశారు. ట్రాఫిక్ చిక్కులు ఏర్పడకుండా.. అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సభకు బయలుదేరే ముందు… అంటే ఒంటిగంటకు .. కేసీఆర్ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజారక్షణ నిర్ణయాలు అందులో తీసుకుని.. సభలో ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.

In this meeting, KCR will explain people what progress his government has made so far. What makes people more curious regarding this meeting is – it is rumored that KCR will announce several welfare schemes as well as several key announcements. While unemployees are expecting the announcement on some job notifications, contract employees as well as permanent employees waiting for key announcements regarding job security and hike in their basic salaries.

While people are waiting to see what KCR has in store for their future, political parties are curiously watching as TRS will sound the launch of election fever in the State from the meeting. They are keenly watching to see if KCR will go for early elections for assembly.

KCR will be the lone speaker to present the progress report of the government in the last four years.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here