వెంకయ్యనాయుడు ఆంధ్రా తరపున మాట్లాడకూడదా?

హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర విభజనలో ఏపీ నష్టపోయిందన్నదీ నిర్వివాదాంశం. ఆవులో తల ఒకరికి, పొదుగు మరొకరికి పంచినట్లు రాష్ట్ర విభజన చేశారని, బిడ్డను చంపి తల్లిని బతికించారని ప్రధాని మోడితో సహా దేశంలోని పలువురు నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ఈ విషయంపై మాట్లాడుతూ, విభజన వలన ఏపీకి హైదరాబాద్‌లాంటి ఆదాయ వనరు లేకుండా పోయిందని అన్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, అనేక ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ఆదాయాలు ఉన్న హైదరాబాద్‌లాంటి రాజధాని నగరం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్‌కు కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. మరోవైపు తెలంగాణ దేశంలోనే సంపన్న రాష్ట్రంగా అవతరించింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వ్యక్తిగా వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రానికి సాయం చేయాలనుకోవటం తప్పని ఎవరూ అనలేరు. జన్మభూమికి సాయంచేయటం ఎవరికైనా కనీస బాధ్యత. కేంద్ర కార్మిక-ఉపాధిశాఖ మంత్రి దత్తాత్రేయకు ఏదైనా అవకాశం వస్తే – చట్టం పరిధికి లోబడి తెలంగాణకు సాయం చేయాలనుకుంటే – హర్షించాలి. అలాగే వెంకయ్య నాయుడు తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటే నిలదీయాలి.

ఇది చూస్తుంటే ఒక పిట్టకథ గుర్తురాకమానదు. ఇద్దరు మునులు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నారు. వారిలో ఒక మునికి అసూయపాలు కాస్త ఎక్కువ. ఆయన ప్రతిదానికీ రెండోమునితో పోటీ పడుతుండేవాడు. రెండోముని ఏది చేస్తే దానికి రెట్టింపు చేయటానికి ప్రయత్నిస్తుండేవాడు. వారి తపస్సుకు మెచ్చి కొంతకాలానికి ఇద్దరినీ అనుగ్రహించాలని దేవుడు నిర్ణయించాడు. ఒకరితర్వాత ఒకరిని ఆయన వరాలు కోరుకొమ్మని అడుగుతూ ముందుగా రెండో ముని దగ్గరకు వెళ్ళాడు. తన సహచరుడు ఏమడుగుతాడో తెలుసుకాబట్టి తనకు ఒక కన్ను పోగొట్టమని రెండో ముని అడిగాడట. దేవుడు తథాస్తు అన్నాడట. తర్వాత మొదటిముని దగ్గరకు వెళితే, రెండో మునికి ఏదిస్తే దానికి రెట్టింపు ఇవ్వమని కోరాడట. రెండు కళ్ళూ తీసేశాడట దేవుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close