చప్పగా సమ్మర్ సెకాండాఫ్…

సమ్మర్ చివరికి వచ్చేసింది. త్వరలో వర్షాలు ప్రారంభం కానున్నాయి. వర్షాలు ప్రారంభం కావడానికి ముందు వేసవిలో బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రముఖులు ఆశించిన స్థాయిలో వసూళ్ల వర్షాలు కురవలేదు. వేసవి ఫస్టాఫ్‌లో వసూళ్ల వర్షాలు బాగా పడ్డాయి. కానీ, సెకండాఫ్‌లోనే సరిగా కురవలేదు. ఓ దుక్కు దున్నుకునేంత వర్షం మాత్రమే పడింది. అసలైన వర్షాకాలంలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షాలు ఎలా పడతాయో చూడాలి.

‘రంగస్థలం’ రిలీజ్‌తో సమ్మర్ స్టార్టింగ్ అదిరింది. సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. తరవాత నితిన్ ‘చల్ మోహనన్‌రంగ‌’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, ‘రంగస్థలం’ రిలీజైన ఇరవై రోజులకు ‘భరత్ అనే నేను’తో వచ్చిన మ‌హేశ్‌బాబు బాక్సాఫీస్‌కి జోష్ అందించాడు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏప్రిల్ ఎండింగ్ వరకూ ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ సినిమాలు బంపర్ వసూళ్లు సాధించాయి. అప్పటికి చాలామంది రెండిటినీ చూసేయడంతో మెజారిటీ థియేటర్ల నుంచి మైనారిటీ థియేటర్లకు షిఫ్ట్ అయ్యాయి.

మే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన సమ్మర్ సెకండాఫ్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ముందుగా థియేటర్లలోకి వచ్చింది. అల్లు అర్జున్ నటనకు పేరు వచ్చింది కానీ, సినిమాకి ఆశించిన వసూళ్లు రాలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ సినిమా ఆకట్టుకోలేదు. ఈ సినిమా విడుదలైన వారానికి వచ్చిన ‘మహానటి’ మాత్రం విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించింది. ‘మహానటి’ భారీ విజయం సాధించింది. ‘మహానటి’ తరవాత మరో సినిమా హిట్ కాకపోవడం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులనూ బాధించింది. ‘మెహబూబా’, ‘నెల టిక్కెట్టు’, ‘ఆఫీసర్’, ‘రాజుగాడు’ సినిమాలు బోల్తా కొట్టడంతో… వేసవి సెలవుల్లో చూడటానికి థియేటర్లలో సరైన సినిమా లేదు. సెకండాఫ్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. క్లైమాక్స్‌లో ‘కాలా’తో వస్తున్న రజనీకాంత్ ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close