ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్న సంజయ్ దత్

హైదరాబాద్: జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ త్వరలో స్వేచ్ఛా వాయువులు పీల్చబోతున్నారు. శిక్షాకాలం పూర్తికాకముందే బయటకు రాబోతున్నారు. సత్ప్రవర్తన కారణంగా అతనిని 103 రోజుల ముందే విడుదల చేయబోతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వనుండటంతో ఇది సాధ్యం కాబోతోందని తెలిసింది. ఫిబ్రవరి 27న ఆయన విడుదలయ్యే అవకాశాలున్నాయి. 1993లో ముంబాయిలో జరిగిన పేలుళ్ళ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటానికి సంబంధించిన కేసులో దత్‌కు కోర్ట్ 2013లో ఐదేళ్ళ శిక్ష విధించింది. సుప్రీమ్ కోర్ట్ కూడా ఆ శిక్షను సమర్థించటంతో దత్ 2013నుంచి పూణే ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్ట్ శిక్ష ప్రకటించకముందు రిమాండ్ ఖైదీగా 18 నెలల శిక్షను దత్ అనుభవించారు. 56 ఏళ్ళ సంజయ్ దత్ విడుదలైన తర్వాత సినిమాలలో మళ్ళీ నటించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

మీడియా వాచ్ : సీఎం రమేష్‌తో డిబేట్‌లో ఓడిపోయిన టీవీ 9

టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close