అందరిలాగే దానం..! వీడిపోయేటప్పుడు పార్టీపై విమర్శలు..!!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్… ఆ పార్టీని ఎంతగా డ్యామేజ్ చేయాలో.. అంతగా చేయడానికి ప్రయత్నించారు. తాను ఎందుకు పార్టీ వీడుతున్నానో చెప్పేందుకు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన దానం… 70 శాతం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మిగతా 30 శాతం కేసీఆర్‌ను పొగడటానికి సమయం కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీకి 30 ఏళ్లు సేవలు చేశానని చెప్పుకున్నారే కానీ.. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడంతా.. ఒకే వర్గం చేతుల్లో ఉందని… విమర్శించేశారు. అదే సందర్భంలో.. ఆయన విమర్శించిన వర్గానికే చెందిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై సానుభూతి చూపించారు. ఆయనను కొందరు పని చేయనివ్వడం లేదని తేల్చేశారు. తాను అన్ని విషయాలను రాహుల్ గాంధీకి చెప్పానని.. దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో… తనకు చెప్పకుండానే టిక్కెట్లిచ్చారని దానం ఆరోపించారు. గ్రేటర్‌లో గెలిచి..పట్టు నిరూపించుకుందామనుకున్న కాంగ్రెస్‌కు గ్రేటర్ అధ్యక్షుడిగా దానం అప్పట్లో పెద్ద గుదిబండగా మారారు. అసలు ఏమీ పట్టించుకోకపోవడంతో.. ఓ దశలో.. ఆయనపై బహిష్కరణ వేటు వేద్దామని కూడా అనుకున్నారు. కాంగ్రెస్‌లో ఉండి.. టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడమే అందుకు కారణం. అదే సమయంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఫ్లెక్సీలు కూడా వేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆగిపోయారు. కానీ ఆశ్చర్యకరంగా.. ఇప్పుడు తనకు గ్రేటర్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. అప్పట్నుంచి గ్రేటర్ అధ్యక్షునిగానే ఉన్న దానం.. పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టలేదు. పీసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.
గ్రేటర్‌ అధ్యక్షునిగా ఏ మాత్రం పని చేయని దానం నాగేందర్‌ను తీసేసి… ఆ స్థానంలో.. అంజన్ కుమార్‌యాదవ్‌ను ఏఐసిసి నియమించింది. దీన్ని సాకుగా చూపి.. ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతున్నారు దానం నాగేందర్. బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని.. టీఆర్ఎస్ ఎజెండాను గట్టిగానే వినిపిస్తున్నారు. తన స్థానంలో నియమితులైన అంజన్ కుమార్ కూడా.. బీసీనే అన్న విషయం తెలిసినా దానం తెలియనట్లే ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది వెళ్లిపోతారని చెప్పారు. తాను అందరి కంటే ముందుగానే దారి చూసుకున్నట్లు.. సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

దానం నాగేందర్ సగటు రాజకీయ నాయకుడిలాగే వ్యవహరించారు. తనకు కాంగ్రెస్‌లో కంటే.. టీఆర్ఎస్‌లోనే రాజకీయ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని ఆశించారు. దాని కోసమే..ఇంత కాలం వెయిట్ చేశారు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి జంప్ అవుతున్నారు. టీఆర్ఎస్‌ను మెప్పించాలి కాబట్టి.. ఇంత కాలం మోసిన కాంగ్రెస్‌పై నిందలేస్తున్నారు. అంతే.. అంతకు మించి దానం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌కు పోయేది.. టీఆర్ఎస్‌కు వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close