చిరు షూటింగులో.. కార్ వాన్ల గోల‌

ఓ పెద్ద హీరో సినిమా అంటే.. ఆ షూటింగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో కార్ వాన్ల హ‌డావుడి ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. చిరంజీవి – కొర‌టాల శివ సినిమా షూటింగ్‌లోనూ ఇదే తంతు. కాక‌పోతే… అక్క‌డ మామూలు స్థాయిలో క‌న్నా, రెండింత‌లు, మూడింత‌ల‌లో కార్‌వాన్లు క‌నిపిస్తున్నాయి. ఈ కార్ వాన్లు స‌ప్ల‌య్ చేయ‌లేక‌… ప్రొడ‌క్ష‌న్ సిబ్బంది గోల చేస్తున్నార‌ని స‌మాచారం.

చిరు 152వ సినిమా ఇటీవ‌ల హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఓ పాట‌తో షూటింగ్ మొద‌లెట్టారు. నైట్ ఎఫెక్ట్‌లో సాగే పాట ఇది. చిరంజీవి, కొర‌టాల శివ‌ల‌కు కార్‌వాన్లు త‌ప్ప‌నిస‌రి. డాన్స్ మాస్ట‌ర్‌కి ఓ కార్ వాన్ ఇచ్చారు. కెమెరామెన్ ర‌త్న‌వేలుకి ఓ కార్‌వాన్, ఆయ‌న టీమ్‌లో ప్ర‌ధాన సిబ్బందికి మ‌రో కార్ వాన్ ఇవ్వాల్సివ‌చ్చింద‌ట‌. మ‌ధ్య‌మ‌ధ్య‌లో రామ్‌చ‌ర‌ణ్ కూడా సెట్‌కి వ‌చ్చి, వ్య‌వ‌హారాల్నిచూసుకుని వెళ్తున్నాడు. ఆయ‌న వెంటే ప్ర‌త్యేక‌మైన కార్ వాన్ వ‌స్తోంది. చిరంజీవి కాస్ట్యూమ్స్ అన్ని కుమార్తె సుస్మిత‌నే చూసుకుంటుంది. ఆమె కూడా కార్ వాన్ డిమాండ్ చేయ‌డంతో – ఆ షూటింగ్ సెట్ చుట్టూ, కార్ వాన్లే క‌నిపిస్తున్నాయ‌ని స‌మాచారం. చిరంజీవి ఎప్పుడూ బ‌డ్జెట్‌ని అదుపులో పెట్టాలి, త‌క్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయాల‌ని చెబుతుంటారు. కానీ… వాస్త‌వ ప‌రిస్థితుల్లోకి వ‌చ్చేస‌రికి.. ఆ నిబంధ‌న‌ల‌న్నీ ఇలా గాలికి కొట్టుకెళ్లిపోతుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close