ఆయేషా కేసుతో ‘వి’

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన `ఆయేషా` కేసు తెలుగునాట సంచ‌ల‌నం సృష్టించింది. కొన్ని సినిమాల క‌థ‌ల‌కు ముడిద స‌రుకుగా నిలిచింది. నాని – సుధీర్‌బాబుల `వి` సినిమాలోనూ ఆయేషా కేసు లాంటి ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని, క‌థ‌లో ఇన్వెస్టిగేష‌న్ కూడా ఈ కేసు చుట్టూనే తిరుగుతుంద‌ని తెలుస్తోంది. `వి` ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ లా క‌నిపిస్తున్నా.. అందులో రివైంజ్ డ్రామాని ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ తెలివిగా జోడించాడ‌ని స‌మాచారం. త‌న జీవితంలో జ‌రిగిన ఓ దారుణ‌మైన ఘ‌ట‌న‌కు నాని ఎలా, ఏ విధంగా ప్ర‌తికారం తీర్చుకున్నాడ‌న్న‌ది `వి` క‌థ‌. నాని మిల‌ట‌రీ అధికారిగా న‌టించాడు. ఓ మిల‌ట‌రీ అధికారికి ఎవ‌రిపై, ఎందుకు ప్ర‌తికారం తీర్చుకోవాల్సివ‌చ్చింద‌న్న‌ది `వి` కాన్సెప్ట్‌. సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అతిధిరావు హైద‌రీ, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టించారు. క‌థ‌లో వీరిద్ద‌రి పాత్ర చాలా కీల‌క‌మని స‌మాచారం. సెప్టెంబ‌రు 5న ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి బొత్స రాజీనామా..?

వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరుతోనే ఈ లేఖ బయటకు...

ఏపీ నుంచి ఐ ప్యాక్ ప్యాకప్..!!

ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్...

దక్షిణాదిపై మోదీ ఆశలు !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీ విడత పోలింగ్ జరిగే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము...

‘ర‌ణ‌భాలీ’గా రౌడీ దేవ‌ర‌కొండ‌?

విజ‌య్ దేవ‌ర‌కొండ - రాహుల్ సంకృత్యాన్ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ర‌ణ‌భాలీ' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదో పిరియాడిక్ యాక్ష‌న్ డ్రామా....

HOT NEWS

css.php
[X] Close
[X] Close