తెలుగుదేశం పై రాష్ట్ర బిజెపి అసంతృప్తి ?

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర మహాసభను మార్చి 6వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించాలని పార్టీ కోర్‌ కమిటీలో నిర్ణయించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా మహాసభకు హాజరౌతారు. కేవలం బిజెపికి మాత్రమేగాక రాష్ట్రంలో భవిష్యత్తు పొలిటికల్ పోలరైజేషన్స్ కోణం నుంచి కూడా ఈ సమావేశానికి విశేష ప్రాధాన్యత వుంది. తెలుగుదేశంతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే తప్ప సొంతంగా ఎదగలేమనే బిజెపి వర్గానికి సొంత చొరవవల్ల సోము వీర్రాజు నాయకుడయ్యారు. పైస్ధాయి జోక్యం వల్లే తెలుగుదేశం ప్రభుత్వం మీద వీర్రాజు బహిరంగ విమర్శలు మానుకున్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా, సొంత పార్టీ ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా పనిచేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కి హరిబాబు విద్యార్ధి దశ నుంచీ వ్యక్తిగత మిత్రుడు కూడా. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు హరిబాబు మాదిరిగా కాకుండా తెలంగాణా బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే తెలుగుదేశంతో మనకి లింకు వద్దని గట్టిగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి మనోగతాన్ని కోర్ కమిటీ క్రోడీకరించి హైకమాండ్ కి పంపింది. ఈ నివేదిక ఆధారంగా తెలుగుదేశంతో భవిష్యత్తు సంబంధాలపై బిజెపి హై కమాండ్ ఒక అవగాహనకు వస్తుంది. ఆ నిర్ణయాన్ని ఆకస్మికంగా ముక్కుసూటిగా ప్రకటించబోరు…రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షుని ఎంపికను బట్టే తెలుగుదేశంతో ఆ పార్టీ భవిష్యత్తు సంబంధాలు ఎలా వుండేదీ తేలిపోతుంది. కంభంపాటి హరిబాబునే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆపార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే బిజెపి తెలుగుదేశం సంబంధాల్లో మౌలికమైన మార్పులు లేవనీ, సోము వీర్రాజు ఆస్ధానంలోకి వస్తే ”ఎప్పటికప్పుడు లెక్కతేల్చేసే” పద్ధతిలోనే రెండు పార్టీల సంబంధాలు వుంటాయని అర్ధం చేసుకోవచ్చు. ఇది హరిబాబు, వీర్రాజుల విషయం కానేకాదు. ఆ ఇద్దరూ సుశిక్షితులైన రాష్ట్రీయ స్వయం సేవకులే…క్రమశిక్షణ గీటు దాటని కమిటెడ్ నాయకులే! నిజానికి వీరిలో ఒకరిని ఎంపిక చేయడం అనేది తెలుగుదేశానికి ఏదో సంకేతం ఇవ్వడానికి బిజెపి హైకమాండ్ ముందున్న ఒక చాయిస్ మాత్రమే!! ….మిత్రపక్షమైన తెలుగుదేశం క్షేత్ర స్ధాయిలో బిజెపిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చులకనగా మాట్లాడుతున్నారు. జన్మభూమికమిటీలలో గాని ఇతర ప్రభుత్వ కమిటీలలోగాని బిజెపితో మిత్రధర్మాన్ని పాటించడం లేదు. . ఏ విధంగా చూసినా బిజెపికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. ఇది పార్టీ ఎదుగుదలకు అవరోధం…అని కోర్ కమిటీ సమావేశంలో నాయకులు ఉదాహరణలతో సహా వివరించారని తెలిసింది. తెలుగుదేశం పార్టీకి తన అసంతృప్తిని గట్టిగా తెలియజేయవలసిన అవసరాన్ని సమావేశం చర్చించింది. కేంద్రప్రభుత్వ పధకాలను కూడా సొంత పధకాలుగా ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం అలవాటును తిప్పికొట్టలంటే ఆయా పధకాల గురించి తామే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. తెలుగుదేశంతో బిజెపి భవిష్యత్తు సంబంధాలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ కోర్ కమిటీ కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగిస్తూ తీర్మానించారు. 6 వతేదీ సాయంత్రం బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించి అమిత్ షాకు బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ సామర్ధ్యాన్ని చూపించాలని కూడా కోర్ కమిటీ భావిస్తోంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్‌ సింగ్‌, రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, ఎంఎల్‌సిలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, మాజీ కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుపాటి పురందేశ్వరి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు రవీంద్రరాజు, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close