శారీరకంగా కొట్టే దెబ్బ కన్నా.. మానసికంగా కొట్టే దెబ్బ చాలా బలమైనది. పైకి గాయంలా కనిపించదు. కానీ ఎదుటి వారి పిచ్చి ప్రవర్తనతో ఆ గాయం తీవ్రత ఏమిటో తెలిసిపోతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలకు ఈ దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్లుగానే కనిపిస్తోంది. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. పేర్ని నాని నుంచి నల్లపురెడ్డి వరకూ.. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. పాలన పూర్తి అయి ఏడాది మాత్రమే అయింది. ఈ ఏడాదిలోనే వీరు ఈ మానసిక రోగాలకు గురి కావడం.. చూసే వాళ్లను పాపం అనిపిస్తోంది.
పూర్తి స్థాయిలో మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన పేర్ని నాని
76 ఏళ్ల ముసలాడివి ఎంత కాలం బతుకుతావు అని పేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు మానసికంగా వికారమైన ఆలోచనలు లేకుండా ఎవరిపైనా కక్ష తీర్చుకోవాలని .. అనుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తప్పు చేసిన వాళ్లను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదలొద్దని మాత్రం వ్యవస్థలకు దిశానిర్దేశం చేశారు. కానీ ఈ వైసీపీ నేతలు తాము చేసిన తప్పుల్ని వెదికి పట్టుకుంటూంటే మానసిక రోగుల్లా మారిపోతున్నారు. ఎదుటి వారి చావు కోరుకుంటున్నారు. తాము ఏది కోరుకుంటే… తమకు అదే జరుగుతుందన్న విషయాన్ని మరచిపోతున్నారు. పేర్ని నాని పూర్తి స్థాయి మానసిక వైకల్యానికి గురయ్యారు. ఆయనకు తక్షణం చికిత్స అందించకపోతే మనుషుల మీద పడి కరిచేలా ఉన్నారు.
నరికేస్తే మంచిదేగా అన్న పొజిషన్లోకి జగన్ రెడ్డి
ఏడాది కూడా పూర్తి కాక ముందే జగన్మోహన్ రెడ్డి కూడా అసహనానికి గురవుతున్నారు. ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత రాకపోవడం.. తమ రౌడీ రాజకీయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతూండటంతో ఇక అసలు ఆశలు ఉండవన్న అభిప్రాయానికి వస్తున్నారేమో కానీ ఆయన కూడా అసహనానికి గురవుతున్నారు. నరికేస్తాం అంటే మంచిదేగా అంటున్నారు. నల్లపురెడ్డి లాంటి వారి మాటల్ని సమర్థిస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారు. అవే మానసిక ఆనందం కలిగిస్తాయని అనుకుంటున్నారు. రాను రాను.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. శాడిజం ముదిరి సైకోయిజం వైపు వెళ్తున్నట్లుగా పరిస్థితి మారింది.
అసలు సినిమా ప్రారంభం కాక ముందే ఇలా అయితే.. తర్వాత?
రాజకీయాలకు కావాల్సింది వయసు కాదు. ఆలోచన ముఖ్యం. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండటం ముఖ్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఇలా దారి తప్పలేదు. రెడ్ బుక్ అనే ఒక్క మాట చెప్పి.. ప్రజల్ని కూడా ఒప్పించారు. అందుకే ఓట్లేశారు. కానీ వైసీపీ నేతలు ఇప్పుడు మానసికంగా దెబ్బతిన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి ఏడాది మాత్రమే అయింది. అసలైన సినిమాను ఇంకా ప్రారంభించలేదని.. టీడీపీ క్యాడర్ అంటున్నారు. అది ప్రారంభిస్తే తర్వాత పరిస్థితి ఏమిటి ?. పిచ్చి పట్టి రోడ్ల మీద గంతులేస్తారేమో ?. ఇలాంటి మానసిక బలహీనులు రాజకీయాలు ఎలా చేస్తారు ?