ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే .. ఎంతో పరిశోధన చేసి జగన్ రెడ్డి మానసిక సమస్య ఏమిటో గుర్తించారు. అమెరికా సుప్రసిద్ధ మెడికల్ కంపెనీ మయో క్లినిక్ పరిశోధనల్ని అధ్యయనం చేసి జగన్ రెడ్డికి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ వ్యాధి బాగా ముదిరిపోయిదని తేల్చారు. ఈ వారం కొత్తపలుకులో ఈ అంశాన్ని వివరంగా చర్చించారు ఆర్కే. దీనికి మందులు కూడా లేవట. ఈ వ్యాధి లక్షణాలేమిటంటే.. తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకోవడం.. అలా కాదన్న వారిని శత్రువులుగా చూడటం లక్షణం. తనను తాను ఎప్పటికప్పుడు పొగుడుకుంటూ ఉండటం.. తాను సుఖంగా లేకపోతే ప్రజలెవరూ సుఖంగా ఉండరని అనుకోవడం ఈ వ్యాధి లక్షణాల్లో ప్రముఖమైనవని చెబుతున్నారు.
జగన్ రెడ్డి తనకు ఉన్న మానసిక సమస్యను అంటువ్యాధిగా మార్చి తన అనుచరులకూ అంటిస్తున్నారని ఆర్కే ఆవేదన చెందారు. బెంగళూరు ప్యాలెస్ లో ఉండి.. తుపాన్ మొంథా నుంచి ఏపీ ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడు జగన్ అని ప్రచారం చేసుకోవడం దీనికి పరాకాష్ట అని ఆర్కే అభిప్రాయం. జగన్ రెడ్డి మనస్థత్వం తెలిసి ఆయన వద్ద మార్కులు కొట్టేయడానికి ఇలాంటి పనులు చేస్తూంటారు. జగన్ వాటిని నిజమని నమ్ముతారు కానీ అతిశయోక్తి అని అనుకోరు. ఇదే విషయాన్ని ఆర్కే చెబుతున్నారు. అందుకే ఆయన తన అనుచరులకూ తన వ్యాధిని వ్యాపింప చేస్తున్నారని తేల్చేశారు.
జగన్ రెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయని.. ఆయన లండన్ మందులు తెచ్చుకుంటారని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటూ ఉంటారు. నిజానికి కొన్ని సందర్భాల్లో జగన్ ప్రవర్తన చూసిన వారికి, ఆయన చేసే రాజకీయాలు చూసిన వారికి.. ఏదో ఊహాలోకంలో ఉంటారేమోనని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయనకు నిజాలు చాలా వరకూ తెలుసుని.. తెలియనట్లుగా రాజకీయాలు చేస్తారని వైసీపీ కార్యకర్తలు భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డికి నిజంగానే ఏదో ఉందని ఆర్కే చెప్పే మాటల్ని చూస్తే వారికీ డౌట్ వస్తుంది.
అదే సమయంలో చంద్రబాబు తుపాన్ ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై ఆర్కే ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఇలాంటి చాలెంజ్ లను తీసుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. ఆయన తీసుకున్న చర్యల వల్ల తుపాను వెళ్లిపోయిన మర్నాడే రోడ్లు క్లియర్ అయ్యారని.. కరెంట్ పునరుద్ధరించారని.. తప్పారు. ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని గుర్తించారు.
