త‌న‌పై దాడికి కుట్ర జ‌రుగుతోంద‌న్న రేవంత్‌..!

ఎన్నిక‌ల‌కు కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నుంచి ప్రాణ‌హాని ఉందంటూ కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ రేవంత్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయం అవుతోంది. త‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ బ‌ల‌గాల‌పై న‌మ్మ‌కం లేద‌నీ, కేంద్ర బ‌ల‌గాలు ర‌క్ష‌ణ‌గా కావాలంటూ కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు. అంతేకాదు, ఈ నేప‌థ్యంలో ఖ‌మ్మం జిల్లా ప‌ర్య‌ట‌న‌ను కూడా రేవంత్ వాయిదా వేసుకున్నారు. త‌న‌పై ఏ క్ష‌ణ‌మైనా దాడి జ‌ర‌గొచ్చ‌నీ, మఫ్టీలో ఉండే పోలీస్ అధికారుల‌తో దాడికి కుట్ర‌లు జ‌రుగుతున్నాయంటూ రేవంత్ మీడియాతో చెప్పారు. న‌క్స‌ల్స్ ఏరివేత‌లో క్రియాశీల‌క పాత్ర పోషించిన కొంద‌రు అధికారుల‌తో త‌న‌పై దాడి చెయ్య‌డానికీ, అవ‌స‌ర‌మైతే అంత‌మొందించ‌డానికి ప్ర‌భుత్వం నిర్దిష్ట ప్ర‌ణాళికతో ఉందని ఆరోపించారు. డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, డీఐజీ ప్ర‌బాక‌ర్ ఈ ప్లాన్ అమ‌లు చేస్తున్నార‌న్నారు.

పార్టీ ఫిరాయింపుల గురించి తాను గ‌తంలోనే చెప్పాన‌నీ అది నిజ‌మైంద‌న్నారు. ఐటీ, ఈడీ అధికారుల గురించి కూడా తాను చెప్పాన‌నీ, అదీ నిజ‌మైంద‌ని రేవంత్ అన్నారు. తాను కొడంగ‌ల్ వెళ్తున్నాన‌నీ, ఏ క్ష‌ణ‌మైనా దాడి జ‌రిగే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలంటూ అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా అని చెప్పారు.

ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ ని కొడంగ‌ల్ లో ఓడించేందుకు భారీ వ్యూహంతోనే తెరాస సిద్ధ‌మౌతోంద‌న్న క‌థ‌నాలు చాన్నాళ్ల నుంచీ ఉన్న‌వే. అసెంబ్లీ వ‌ర‌కూ రేవంత్ ని రానివ్వ‌కూడ‌ద‌నేది ఆ పార్టీ అప్ర‌క‌టిత వ్యూహం అనేది బాగా ప్ర‌చారంలో ఉంది. మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్ రావులు ఈ నియోజ‌క వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. రేవంత్ కాంగ్రెస్ లో చేరిన వెంట‌నే… ఆయ‌న అనుచరుల్లో కొంత‌మంది తెరాస‌లోకి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం ఆ మ‌ధ్య చేశారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో రేవంత్ కి పోటీగా మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి సోద‌రుడు ప‌ట్నం న‌రేందర్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. తెరాస త‌ర‌ఫున ప్ర‌చారానికి మంత్రి కేటీఆర్ కూడా ఇటీవ‌లే వ‌చ్చారు. తెరాస‌కు ధీటుగా సోనియా గాంధీతో స‌భ ఏర్పాటు చేసి, విజ‌య‌వంతం చేశారు రేవంత్‌.

అయితే, రెండ్రోజుల కింద‌టే కొడంగ‌ల్ లో సొమ్ము ప‌ట్టుబ‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రేవంత్ వ‌ర్గం నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. కొడంగ‌ల్ ఎన్నిక‌ను వాయిదా వేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ, దానికి అనుగుణంగానే తెర వెన‌క ఏదో జ‌రుగుతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా రేవంత్ వాయిదా వేసుకున్న ప‌రిస్థితి..! దీంతో కొడంగ‌ల్ లో ఏం జ‌రుగుతోంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close