సుశాంత్‌ ‘ఆటాడుకుందాం..రా’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన అఖిల్‌

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). అఖిల్‌ బాలనటుడిగా నటించిన ‘సిసింద్రీ’ చిత్రంలోని ‘ఆటాడుకుందాం.. రా..’ అనే పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అదే టైటిల్‌తో సుశాంత్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను అఖిల్‌ అక్కినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సుశాంత్‌ మాట్లాడుతూ – ”ఇప్పటివరకు నేను చేసిన కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాల కంటే పూర్తి డిఫరెంట్‌గా వుండే సబ్జెక్ట్‌ ఇది. నాగేశ్వరరెడ్డిగారు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆటాడుకుందాం.. రా’ నా కెరీర్‌లో డెఫినెట్‌గా మంచి కమర్షియల్‌ హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.

నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల మాట్లాడుతూ – ”అక్కినేని అఖిల్‌ చేతుల మీదుగా రిలీజ్‌ అయిన మా ‘ఆటాడుకుందాం..రా’ చిత్రం ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సుశాంత్‌ గెటప్‌ చాలా బాగుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. సినిమా చాలా బాగా వస్తోంది. నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతోపాటు యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘ఆటాడుకుందాం..రా’ సుశాంత్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
సుశాంత్‌, సోనమ్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాస్‌, సుధ, ఝాన్సీ, ఆనంద్‌, రమాప్రభ, రజిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close