​శిల్పకళా వేదికపై ఈనెల 9న ‘మేము’ మ్యూజిక్‌ ఫంక్షన్‌!!

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న ‘మేము’ చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సన్నితి ప్రొడక్షన్స్‌ అధినేత ప్రసాద్‌ సన్నితి- శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్‌ అధినేత తమటం కుమార్‌రెడ్డి ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు. ‘పిశాచి’ ఫేం అర్రోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వెన్నెలకంటి-సాహితి-చంద్రబోస్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. హైద్రాబాద్‌, హైటెక్‌ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికపై జరగనున్న ఈ ఆడియో వేడుకలో సూపర్‌స్టార్‌ సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి, చిత్ర దర్శకుడు పాండిరాజ్‌, సంగీత దర్శకుడు అర్రోల్‌ కొరెల్లి తదితర చిత్ర బృందంతోపాటు.. మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అతిరధమహారధులు అతిధులగా పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్య సినిమాకు తెలుగులో గల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ‘మేము’ ఆడియో ఫంక్షన్‌ను శిల్పకళా వేదికపై అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మొత్తం ‘మేము’ చిత్ర బృందం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు’ అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.యల్‌, సాహిత్యం: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్‌, సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య`కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close