వరంగల్ ఉప ఎన్నికలలో జగన్ ప్రచారం!

వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించగానే చాలా మంది అడిగిన ప్రశ్న ‘ఎందుకు’? అని. కేవలం వైకాపాకే ఇటువంటి ప్రశ్న ఎదురవడం రాజకీయాలలో చాలా విచిత్రమే. కానీ ఆ విధంగా ప్రశ్నించడానికి కారణాలు అందరికీ తెలిసినవే. అలాగా ప్రశ్నించిన వారికి దాని సమాధానం కూడా తెలిసి ఉండటం మరో విచిత్రం. వైకాపా ఎదుర్కొంటున్న ఈ చిత్రవిచిత్ర ప్రశ్నల సంగతి ఎలా ఉన్నా మరో ఆసక్తికరమయిన వార్త వినిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేస్తున్న నల్లా సూర్య ప్రకాష్ కి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రచారం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈనెల 16 నుండి వరుసగా నాలుగు రోజుల పాటు జగన్ వరంగల్ ల్లో ప్రచారం చేస్తారని సమాచారం. అదే నిజమయితే అదీ ఒక విశేషమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ తెలంగాణా జిల్లాలలో అడుగుపెట్టి చాలా కాలమే అయ్యింది. కనుక తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close