నేను కూడా పాడేస్తానంటున్న అల్లు అర్జున్

మెగా హీరోల్లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న రెసుగుర్రం ఎవరంటే అందరికి గుర్తొచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే.. తీసే ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారక్టర్స్ తో ప్రేక్షకులను ముఖ్యంగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ వరుసగా మూడు సినిమాలను 50 కోట్ల మార్క్ ను టచ్ చేసి సూపర్ మచ్చి అనిపించుకున్నాడు. అయితే బన్ని యాక్టింగ్ సూపర్.. ఫైట్స్ కూడా ఎక్సలెంట్.. ఇక డ్యాన్సులంటారా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కుమ్మేస్తాడు.

అయితే తన కెరియర్ లో ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న బన్ని కొత్తగా సింగర్ అవతారమెత్తబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కూడా తన గొంతు సవరించుకోబోతున్నాడట. దీనికి సంబంధించిన రికార్డింగ్ కూడా ఈ మధ్యనే ముగిసిందని సమాచారం. ఇప్పటికే స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఏదో ఒక బిట్ సాంగ్ అయినా పాటి వినిపిస్తున్న వారే. ఇప్పుడు వారి దారిలో థమన్ ఆధ్వర్యంలో బన్ని కూడా సరిగమలు పాడేస్తున్నాడు.

అంతేకాదు ఈ సాంగ్ కూడా మాస్ బీట్ అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి బన్నితో థమన్ చేసే ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సరైనోడు సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేసా కథానాయికలుగా నటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close