చిన్నబ్బాయి సిన్మాలకు అల్లు అరవింద్‌ కత్తెరలు…?

గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ గురించి, అల్లు అరవింద్‌ గురించి తరచూ ఓ విమర్శ వినిపింస్తుంటుంది… ఓ పట్టాన కథలు ఓకే చేయరని! ఇకవేళ ఓకే చేసినా… సినిమా చేసేంతవరకూ అడుగడుగునా దర్శకుణ్ణి చేయి పట్టుకు నడిపిస్తారని! అవన్నీ ఎంతవరకూ నిజమో తెలియదు కానీ… చిన్న కుమారుడు అల్లు శిరీష్‌ సినిమాల్లో ఆయన హస్తం తప్పకుండా వుంటుంది. సినిమా స్ర్కిప్ట్‌ దగ్గర్నుంచి థియేటర్లలోకి వచ్చే వరకూ డాడీ సలహాలు తీసుకుంటానని అల్లు శిరీష్‌ స్వయంగా చెప్పాడు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ‘‘నేను చేయబోయే సినిమా కథలను ముందుగా డాడీ, సెట్స్‌కు వెళ్లే ముందు బన్నీ వింటారు. ఇద్దరూ తమ తమ సలహాలు చెబుతారు. షూటింగ్‌ అయ్యాక, ఎడిటింగ్‌ ముందూ తర్వాత డాడీ సినిమా చూస్తారు’’ అని అన్నారు. ఎడిటింగ్‌కి ముందు తర్వాత అంటే… అల్లు అరవింద్‌ సలహాలతో సినిమాలకు కత్తెరలు పడతాయన్నమాట! అయితే… అల్లు శిరీష్‌ మాత్రం గీతా ఆర్ట్స్‌ సంస్థలో నిర్మించే సినిమా కథలను వినరట! ‘‘డాడీ, ‘బన్నీ’ వాసు మా బ్యానర్‌లో తీసే సినిమాల కథలు వింటారు. మా ఫ్యామిలీ హీరోలకు సూటయ్యే కథలు వస్తే మాకు చెబుతారు. లేదంటే బయట హీరోలతో సినిమాలు చేస్తారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేస్తున్నాం. అంతకు ముందు నాగచైతన్యతో ‘100% లవ్‌’, నానితో ‘భలే భలే మగాడివోయ్‌’ చేశాం కదా’’ అన్నారు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే వార్తను ఖండించారు. ‘నేనూ ఈ వార్తను తొలిసారి వింటున్నా. గీతా ఆర్ట్స్‌ చాలామంది దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది. అందులో శ్రీకాంత్‌ అడ్డాల ఒకరు. ఆయన చెప్పిన కథకు నేను సూటవుతానని డాడీ అనుకున్నారేమో’’ అన్నాడు శిరీష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close