ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ సిటీ నిర్మాణంపై దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ రాజన్ సింగ్ తన RSLive ద్వారా అమరావతిలో జరుగుతున్న పనులపై రూపొందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ, దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
దేశంలోనే మొదటి ప్లాన్డ్ సిటీ
అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న గ్రిడ్ తరహా డిజైన్ , కృష్ణా నదీ తీరాన అభివృద్ధి చెందుతున్న జోనల్ సిస్టమ్ చూసి దేశం అబ్బురపడుతోంది. ప్రభుత్వ ఉచిత పథకాల కంటే శాశ్వతమైన మౌలిక సదుపాయాల కల్పన ఎంత ముఖ్యమో అమరావతి నిరూపిస్తోందని ఈ వీడియో చూసి అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో సంక్షేమం ఏ మాత్రం ఆపకుండా.. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల క్యాంపస్‌లు ఈ నగరం భవిష్యత్తు వైభవాన్ని చాటిచెబుతున్నాయి.
పనులు కవర్ చేయడానికి రెండు రోజులు పట్టిందన్న యట్యూబర్
తీవ్రమైన ఎండలను కూడా లెక్కచేయకుండా జాతీయ స్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పనను రికార్డు చేస్తున్నారు. అత్యాధునిక రవాణా సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పక్కాగా విభజించిన నివాస , వాణిజ్య జోన్లను చూసి భారతదేశంలో భవిష్యత్తు నగరం ఇలా ఉండబోతోంది అంటూ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనుల వేగం చూస్తుంటే ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, రాబోయే తరాలకు ఒక ఆదర్శప్రాయమైన మోడల్ అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అభివృద్ధికి కొత్త మోడల్
రాజకీయ వివాదాలను పక్కన పెట్టి, ఒక ప్రాంతాన్ని ఆర్థిక ఇంజిన్‌గా ఎలా మార్చవచ్చో అమరావతి ప్రాజెక్టు ద్వారా స్పష్టమవుతోందని జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం వల్ల అమరావతిపై దేశవ్యాప్త పెట్టుబడిదారులలో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది. మొత్తానికి, ప్రపంచ స్థాయి రాజధాని అనే చంద్రబాబు కల ఇప్పుడు అడుగులు దాటి పరుగులు పెడుతూ, దేశపటంలో ఒక వెలుగులీనుతున్న నక్షత్రంలా కనిపిస్తోంది.
