“రివైజ్డ్ జాబ్ క్యాలెండర్” ప్రకటించక తప్పదా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సారి నిరుద్యోగుల సెగ తగులుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా నిరుద్యోగుల నిరసనలే కనిపిస్తున్నాయి. కరోనా నిబంధనలు పట్టించుకోకుండా…ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు. నిజానికి జాబ్ క్యాలెండర్ అనేది రెండేళ్లు ఆలస్యం అయింది. ఆలస్యం అయినా జగనన్న చెప్పినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తారని చాలా మంది ఆశతో ఉన్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయి.. చివరికి ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో జాబుల్లేకపోవడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. తాము జాబ్ క్యాలెండర్ ప్రకటిచగానే… నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అయి పాలాభిషేకాలు జరుగుతాయని అనుకున్నారు.

కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు పాలభిషేకాలు చేశారు కూడా. కానీ కడుపు మండిన నిరుద్యోగులు రోడ్డు మీదకు రావడంతో .. సీన్ రివర్స్ అయిపోయింది. గ్రూప్స్ ఉద్యోగాలు 36 మాత్రమే ఉండటం… యువత ఎక్కువ మంది ఆశలు పెట్టుకునే పోలీసు ఉద్యోగులు నాలుగు వందలే ఉండటం నిరుద్యోగుల ఆవేశానికి కారణం అవుతోంది. రిజర్వేషన్లు తీసేస్తే.. గ్రూప్స్‌లో జనరల్ కేటగిరికి నాలుగైదు ఉద్యోగాలు దక్కడం కూడా గగనమే. అదే పరిస్థితి పోలీసు ఉద్యోగాల్లోనూ ఉంటుంది. దీంతో… గత మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ.. కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు పెట్టుకుంటున్న నిరుద్యోగుల్లో ఒక్క సారిగా ఆవేశం పెల్లుబీకింది. విద్యావేత్తలు.., ఈ జాబ్ క్యాలెండర్‌ను పచ్చి మోసంగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తూండటంతో… యువతలో ఆవేశం పెరిగిపోతోంది.

రోజు రోజుకు.. వారి ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. వీరి ఆవేశానికి ఉద్యోగాల విప్లవం సృష్టించామన్న ప్రభుత్వ ప్రకటనలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితిలో యువత గందరగోళంలో పడిపోయి ఆవేశానికి లోనవుతోంది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుడా ఉన్నట్లయినా బాగుండేదని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. యువతలో ఇంత ఆవేశం వస్తుందని వారు కూడా ఊహించలేకపోయారు. అందుకే… రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close