కరెంట్ చార్జీలు పెంచుతాం.. ప్రిపేర్ అవ్వండి !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు ప్రజలను మెంటల్‌గా ప్రిపేర్ చేసి… ప్చ్ పెంచుతారు.. ఏం చేయలేం అనే పరిస్థితి కల్పించడానికి ప్లాన్డ్‌గా ప్రచారం చేసింది. విద్యుత్ చార్జీలు పెంచాలంటే ఏపీఈఆర్‌సీ అనుమతి ఉండాలి. దీనికి చైర్మన్‌గా నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆయన మీడియా సంస్థలకు పిలిచి ఇంటర్యూలు ఇస్తున్నారు. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు తప్పని.. విద్యుత్ చార్జీల పెంపు ఉండకూడదనే మైండ్ సెంట్ నుంచి ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. అంటే విద్యుత్ చార్జీలు పెంచుతారు ..భరించాలని ఆయన ఇప్పటి నుండే సూచిస్తున్నారు.

ఏపీఈఆర్‌సీ చైర్మన్ ఇటీవల ట్రూప్ అప్ చార్జీల పేరుతో ప్రజల వద్ద నుంచి అదనపు చార్జీలు వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.కానీ ఆయన దానికి నిబంధనలు పాటించలేదు. నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయసేకరణ చేయాలి . కానీ చేయలేదు. కోర్టులో ఎదురు దెబ్బ తగులుతుందని తెలియడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ .., వసూలు చేసిన ట్రూప్ అప్ అచార్జీలు ప్రజలకు వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇప్పుడు నేరుగా చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయసేకరణ చేస్తున్నారు. చార్జీల పెంప ఖాయమని ముందుగానే చెబుతున్నారు.

టీడీపీ హయాలో ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. సంప్రదాయేతర ఇంధన్ విద్యుత్‌లో పెట్టుబడులు భారీగా ఆకర్షించడంతో విద్యుత్ చార్జీలు ఇక పెంచే పరిస్థితి రాదని… వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పటికి ఆరేడు సార్లు శ్లాబులు మార్చి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ చార్జీలే పెంచాలనుకుంటున్నారు. నిర్వహణ.. నడపడం తేడా వస్తే భారం ప్రజలపై పడుతుందేది విద్యుత్ చార్జీల అంశం మరో ఉదాహరణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close