ఇంతకూ ఇన్నర్ రింగ్‌రోడ్‌లో లోకేష్ ఏం చేశారని కేసు !?

ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని ప్రభుత్వం కేసు పెట్టింది. నిందితుల్ని చేర్చారు. అందులో లోకేష్ ను కూడా ఏ 14 అన్నారు. కానీ అసలు లోకేష్ పాత్ర ఏమిటి.. పధ్నాలుగో నెంబర్ ఎందుకు ఇచ్చారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే లోకేష్ కు ..సీఆర్డీఏకు ఎలాంటి సంబంధం లేదు. అధికారికంగా అసలు అమరావతి వ్యవహారాల్లో భాగం కాలేదు. మరి ఎలా కేసు పెట్టారు. ఎక్కడ నేరం చేశారని పెట్టారు అన్నది లోకేష్ లాయర్లకూ అర్థం కావడం లేదు.

ఇక్కడ కామెడీ ఏమిటంటే.. వైసీపీ వైళ్లకూ ఇందులో లోకేష్ పాత్రేమిటో క్లారిటీ లేదు. ఫైబర్ నెట్ స్కాంలో ఓ అధికారికి ఢిల్లీ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని సగం లేఖ చూపించి హడావుడి చేశారు.. మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సంబంధం ఏమిటి.. మామూలుగా చిన్న మిస్ లీడ్ చేసే ఆధారం ఉన్నా సాక్షిలో చిలువలు పలువులుగా చెబుతారు. అలాంటిదేమీ చెప్పలేదు. సీఐడీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టలేదు. అందులో వైసీపీ సోషల్ మీడియాలో వాళ్లు కూడా ఏ 14 అని ప్రచారం చేస్తున్నారు కానీ ఏం చేశారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది లేదు. అసలు భూసేకరణ చేయలేదు . ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అధికారులు అలైన్ మెంట్ రెడీ చేశారు. అంతే.. అందులో లోకేష్ పాత్రేమిటో ఎవరికీ తెలియదు. కానీ సాక్షి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసిందట ఏసీ సీఐడీ.

లబ్ది పొందాలని ప్రయత్నించడం ఏమిటో… దానికి కేసు పెట్టడం ఏమిటో.. నిందితుడుగా మార్చడం ఏమిటో… న్యాయనిపుణులకూ తలతిరిగిపోతోంది. ఆ లెక్కన..ఐఆర్ఆర్ పక్కన ఉన్న అన్ని స్థలాల వాళ్లను ముఖ్యంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారందరిపైనా కేసులు వేయేలేమో ?. ఎందుకంటే ఐఆర్ఆర్‌కు హెరిటేజ్ అంతే దూరం ఉంది. కేసు కూడా పెట్టేశారు మరి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close