సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు !

అనుకున్నదే అయింది. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ధియేటర్ యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు గతంలో ఉండేదని..ఈ ప్రభుత్వం తొలగించిందని కోర్టులో వాదించాయి. పదేళ్ల కిందటి నాటి టిక్కెట్ రేట్లను ఖరారు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వాదించారు.

అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఎందుకు రేట్లనుతగ్గిస్తూ జీవో జారీ చేయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పలేకపోయారు . దీంతో హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాత పద్దతిలో టిక్కెట్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గత ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో జారీ చేసింది. జీవో ప్రకారం… అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250. ఈ ధరలు ధియేటర్ల నిర్వహణకు కూడా రావని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

టిక్కెట్ రేట్లు పెంచాలని అదే పనిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. టాలీవుడ్‌లో వరుసగా బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పుష్ప , ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. వీటన్నింటికీ హైకోర్టు నిర్ణయం రిలీఫ్ కల్పించిందని అనుకోవచ్చు. హైకోర్టు జీవోను సస్పెండ్ చేయడంతో పాత విధానంలోనే టిక్కెట్ ధరలు ఉండనున్నాయి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close